కేసీఆర్ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా పడింది. సీఎం కేసీఆర్ పుట్టిన రోజైనా ఫ్రిబవరి 17న నూతన సచివాలయం ప్రారంభించాలని నిర్ణయించిన.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రారంభోత్సవం వాయిదా వేసింది.
నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి పలు రాష్ట్రాల సీఎంలు, నాయకులనూ ఆహ్వానించి.. రాష్ట్రం అంత వేడుకలు జరుపుకోవాలని నిర్ణయించినా కేసీఆర్ సర్కార్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాయిదా వేసింది, త్వరలోనే కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి సంబంధించిన తేదిని ప్రకటించనున్నారు.
దాదాపు 28 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన సచివాలయ విస్తీర్ణం 10,51,676 చదరపు అడుగులు ఉంటుంది. 11 అంతస్తుల సచివాలయంలో 2, 5 అంతస్తుల్లో మంత్రుల కార్యాలయాలు, ఆరో అంతస్తులో ముఖ్యమంత్రి కార్యాలయం ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది.