పత్రికాధిపతికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యసభ సీటును గిఫ్ట్‌గా ఇచ్చారు. నమస్తే తెలంగాణ ఎండీ దీవకొండ దామోదర్‌రావుకు రాజ్యసభ సీటు ఖరారైంది.
ఇదిలా వుండగా టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థుల పేర్లను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. నమస్తే తెలంగాణ దినపత్రిక ఎండీ దీవకొండ దామోదర్ రావు, హెటిరో అధిపతి డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర(గాయత్రి రవి) పేర్లను రాజ్యసభకు పంపనున్నట్టు సీఎం కేసీఆర్ వెల్లడించారు.
దీంతో టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థుల ఉత్కంఠకు తెరపడింది. రాజ్యసభకు పత్రికాధిపతిని ఎంపిక చేయడం చర్చనీయాంశమైంది. గతంలో కూడా ఈయన పేరు ప్రముఖంగా వినిపించిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఇప్పటికి ఆయనకు రాజ్యసభ సీటు దక్కింది.
నమస్తే తెలంగాణ పత్రిక టీఆర్ఎస్, కేసీఆర్ సర్కార్‌కు అనుకూలంగా పని చేస్తుంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం తెలంగాణ పబ్లికేషన్స్‌కు దామోదర్‌రావు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఈ పబ్లికేషన్స్ నేతృత్వంలో నమస్తే తెలంగాణ (తెలుగు), తెలంగాణ టుడే (ఇంగ్లీష్) దినపత్రికలు నడుస్తున్నాయి. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం మద్దునూరు నివాసి దీవకొండ దామోదర్‌రావు.
తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి కేసీఆర్ వెంట దామోదర్‌రావు నడిచారు. టీఆర్ఎస్ ఆవిర్భావం 2001 నుంచి ఆయన పార్టీలో పలు హోదాల్లో పని చేశారు. టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, ప్రధాన కార్యదర్శిగా, పార్టీ ఫైనాన్షర్‌గా పని చేశారు.
తెలంగాణకు సొంత మీడియా సంస్థలు అవసరమని ఉద్యమనేత కేసీఆర్ ఆశయానికి తగ్గట్టు…టీ న్యూస్ చానల్, నమస్తే తెలంగాణ పత్రికలను స్థాపించడంలో దామోదర్‌రావు కీలకపాత్ర పోషించినట్టు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.