బీజేపీలో చేరికకు ఎమ్మెల్యేలు భయపడటానికి కారణం..

గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చాలామంది కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటంతో బీజేపీ నాయకులకు చాలా బాధగా ఉంది. ఆ పార్టీలోకి చేరికలు లేవు. ఆ పార్టీలో చేరికల కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ…

గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చాలామంది కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటంతో బీజేపీ నాయకులకు చాలా బాధగా ఉంది. ఆ పార్టీలోకి చేరికలు లేవు. ఆ పార్టీలో చేరికల కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఆ పార్టీ వైపు ఎవరూ చూడటంలేదు. 

పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నా ఎవరూ పార్టీ వైపు చూడటంలేదని తెగ బాధపడిపోతున్నారు. అప్పుడెప్పుడో చేరినవారు తప్ప బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులెవరూ కాషాయ పార్టీలో చేరలేదు. అయినప్పటికీ గులాబీ పార్టీ నాయకులు తమతో టచ్ లో ఉన్నారని బీజేపీ లీడర్లు చెప్పుకుంటున్నారు. 

తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గులాబీ పార్టీకి చెందిన 26 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని చెప్పాడు. మరి టచ్ లో ఉన్నవారిలో కొంతమందైనా చేరాలి కదా. కానీ వెనుకాడుతున్నారట. 

ఇందుకు కారణం …బీజేపీ రూల్ ప్రకారం ఆ పార్టీలో చేరాలంటే ఉన్న పదవికి రాజీనామా చేయాలట. అందుకే గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు చేరడానికి వెనుకాడుతున్నారని సంజయ్ చెప్పాడు. కాంగ్రెస్ లో ఈ రూల్ లేదు కాబట్టి ఆ పార్టీలోకి వెళ్లిపోతున్నారని మాట్లాడాడు.

బీజేపీ అండ్ బీఆర్ఎస్ నాయకులు కొందరు పార్టీ ఫిరాయింపుల విషయంలో రాహుల్ గాంధీని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకున్నవారు పదవికి రాజీనామా చేసి చేరాలని రాహుల్ చెప్పాడని, కానీ రేవంత్ రెడ్డి దాన్ని పట్టించుకోకుండా చేర్పించుకుంటున్నాడని విమర్శిస్తున్నారు. 

అయినా రాహుల్ ఏమీ అనడంలేదని అంటున్నారు. బీజేపీ, గులాబీ పార్టీ నాయకులు ఉప ఎన్నికలు రావాలని కోరుకుంటున్నారు. అందుకే అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరిన గులాబీ పార్టీ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలని అదే పనిగా డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీ స్పీకర్ అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నా అది సాధ్యం కావడంలేదు.

కోర్టుకు పోతామంటున్నారు. గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా కోర్టుకు వెళ్లారు. స్పీకర్ నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోబోమని చెప్పింది. రాజీనామాలు చేసినా వాటిని ఆమోదించాలా, వద్దా అనేది స్పీకర్ ఇష్టం. ఎక్కడైనా స్పీకర్ అధికార పార్టీ నాయకుడే ఉంటాడు. 

కాబట్టి ఆయన పార్టీకి, ప్రభుత్వానికి నష్టం కలిగించే పని చేయడు. కాబట్టి పార్టీలో చేరినవారు రాజీనామా చేసినా అవి ఎప్పటికీ ఆమోదం పొందవు. గతంలో తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వ్యవహారం ఇదే. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తాయని అనుకుందాం. కాంగ్రెస్ పార్టీలో చేరినవారు ఓడిపోతారో గెలుస్తారో ఎవరు చెప్పగలరు. 

అందుకే సాధ్యమైనంతవరకు ఉప ఎన్నికలు రాకుండానే చూసుకుంటారు. కాబట్టి తెలంగాణలో ఉప ఎన్నికలు జరిగే అవకాశం లేకపోవొచ్చు. గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రధాన కారణం ఉప ఎన్నికలు జరగవు కాబట్టి.