నమ్మించి దెబ్బేస్తున్న టీఆర్ఎస్ నేత‌లు!

ప్రజాస్వామ్యంలో ప్ర‌జ‌ల‌కు మోసపు హామీలిచ్చి ఎమ్మెల్యేలు ఆయన రాజకీయ నాయకులు ఉన్నార‌న్న దానిలో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ కొంతమంది నాయ‌కులు ఒక పార్టీలో గెలిచి వేరే పార్టీకి వెళ్లేటప్పుడు రకరకాలు కారణాలు…

ప్రజాస్వామ్యంలో ప్ర‌జ‌ల‌కు మోసపు హామీలిచ్చి ఎమ్మెల్యేలు ఆయన రాజకీయ నాయకులు ఉన్నార‌న్న దానిలో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ కొంతమంది నాయ‌కులు ఒక పార్టీలో గెలిచి వేరే పార్టీకి వెళ్లేటప్పుడు రకరకాలు కారణాలు చూపుతుంటారు. అందులో చాలామందిని ఇత‌ర పార్టీలు కొనుగోలు చేస్తారని వార్తలు వస్తుంటాయి అది ఎంతవరకు నిజమనేది కొనుగోలు చేసేవారికి అమ్ముడుపోయో వారికి మాత్రమే తెలుసు. 

కానీ తెలంగాణ ఏర్పాడిన‌ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలోని ఒక ఎమ్మెల్యేను కొని ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీకి అనుకులంగా ఓటు వేయించుకోవాడానికి ఓటుకు నోటు ప్ర‌య‌త్నం టీఆర్ఎస్ ఎమ్మెల్యే ద‌గ్గ‌ర ఉండి మొత్తం వీడియో రూపంలో చూపించారు. ఆ దెబ్బ‌కు హైద‌రాబాద్ న‌గ‌ర‌న్ని నిర్మించినా అని చెప్పుకుంటూన్నా 40 ఇయ‌స్స్ ఇండ్ర‌స్టీ రాత్రికి రాత్రే ఖాళీ చేసీ త‌న క‌ల‌ల స్వ‌ప్నం అమ‌రావ‌తికి రావ‌ల్సి వ‌చ్చింది.  

ఆ దెబ్బ‌తో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌ను డ‌బ్బుతో కొన‌డానికి కూడా భ‌యం పెట్టుకొని అటువంటి వాటి జోలికి పొని ఇత‌ర పార్టీల నాయ‌కులు ఇప్పుడు మాత్రం స‌రాస‌రి కేసీఆర్ కు నమ్మిన బంటులాగా ఉండే న‌లుగురు ఎమ్మెల్యేల‌ను కొన‌డానికి చేసిన ప్ర‌య‌త్నం తీవ్ర దూమ‌రం లేపుతోంది. ఈ న‌లుగురు ఎమ్మెల్యేలు కూడా స్వ‌య‌న రాయ‌భారానికి పిలిచి పోలీసుల‌కు ప‌ట్టించారు. వీరు వెనుక ఎవ‌రూ ఉన్నారో లేదో తెలియ‌దు కానీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసినా ప‌నికి దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోంది. ఇక్క‌డ కూడా న‌మ్మించి మోసం చేశారు టీఆర్ఎస్ నేత‌లు.

బహుశా ఇక‌పై ఎప్పుడైనా సరే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనాలని చూస్తే మాత్రం కాసింత ఆలోచించుకోవాల్సి వస్తుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులు కొనుగోలు అనేది ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరం కాదు. కానీ అన్ని పార్టీలు ఇత‌ర పార్టీల నాయ‌కుల‌కు తాయిళాలు ఇచ్చి త‌మ పార్టీ వైపు తిప్పుకుంటూన్నారు.