బాలయ్య సినిమాలో రెండు ‘స్పెషల్స్’

మైత్రీ సంస్థ ప్రెస్టీజియస్ గా నిర్మిస్తున్న సినిమా వీర సింహా రెడ్డి. నందమూర బాలయ్య-శృతిహాసన్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు యాక్షన్ ఎపిసోడ్ లు హైలైట్ గా నిలుస్తాయన్న సంగతి తెలిసిందే. కానీ ప్రేక్షకుల…

మైత్రీ సంస్థ ప్రెస్టీజియస్ గా నిర్మిస్తున్న సినిమా వీర సింహా రెడ్డి. నందమూర బాలయ్య-శృతిహాసన్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు యాక్షన్ ఎపిసోడ్ లు హైలైట్ గా నిలుస్తాయన్న సంగతి తెలిసిందే. కానీ ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించాలంటే అవి మాత్రమే చాలవు కదా. సరైన పాటలు వాటికి తగ్గ డ్యాన్స్ లు కూడా వుండాలి. వీర సింహా రెడ్డి లో అలాంటి మూవ్ మెంట్స్ రెండు వుంటాయని తెలుస్తోంది.

ఒకటి ఐటమ్ సాంగ్ లాంటి గీతం. ఈ పాట కోసం చంద్రిక రవి అనే మోడల్ ను తీసుకువచ్చారని తెలుస్తోంది. ఇండియన్ ఆరిజన్ ఆస్ట్రేలియన్ మోడల్ అయిన ఈమె ఇప్పటికి నాలుగైదు సినిమాల్లో చేసి వున్నారు. తెలుగులో చేయడం ఇదే ప్రధమం. ఈ స్పెషల్ గీతాన్ని ఇప్పటికే చిత్రీకరించేసారు.

ఈ గీతం చాలదన్నట్లు మరో స్పెషల్ సాంగ్ కూడా వుందని తెలుస్తోంది. అయితే ఈ స్పెషల్ సాంగ్ లో హీరో హీరోయిన్లు బాలయ్య..శృతి హాసన్ లతో పాటు మరో స్పెషల్ యాక్ట్రస్ ను ఎవరినైనా జోడిస్తే ఎలా వుంటుందనే ఆలోచనలు సాగుతున్నాయి. జస్ట్ రెండు నిమషాల పాటే స్పెషల్ అప్పీయరన్స్ వుండే ఈ క్యారెక్టర్ కోసం ఏ హీరోయిన్ అయితే బాగుంటుందనే లెక్కలు వేస్తున్నారు. లేదూ అంటే మామూలుగానే చిత్రీకరిస్తారు. ఈ ఒక్క పాట మాత్రమే బకాయి వుందని బోగట్టా.

మొత్తం మీద హిట్ కొట్టాలనే కసితో మైత్రీ సంస్థ వీరసింహారెడ్డి సినిమాను తయారు చేస్తున్నట్లు కనిపిస్తోంది.