తెలంగాణలో అన్ని పార్టీలు మునుగోడు ఉపఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు ప్రచారం కూడా మొదలు పెట్టాయి. ఒక కాంగ్రెస్ తప్ప అన్ని రాజకీయ పార్టీలు ఇంచార్జ్ లు పెట్టి సీనియర్ నాయకుల నుండి కార్యకర్తల వరకు అందరూ పల్లెపల్లెలకు తిరుగుతున్నాయి.
తాజాగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఉపఎన్నికల ప్రచారంకు వెళ్తనని ప్రకటించారు. పార్టీ అదేశిస్తే వెంటనే ప్రచారం చేసేందుకు సిద్ధంగా ఉన్ననని సృష్టం చేశారు. సీఎల్పీ నేత ముల్లు భట్టి విక్రమార్కతో తన నివాసంలో భేటిలో మునుగోడు ఉపఎన్నిక.. అభ్యర్థి ఎంపిక వంటి అంశాలపై చర్చించారు.
మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక విషయంలో నేను ఎవరి పేరు సూచించానో మీడియాకు చెప్పలేనని అది పార్టీ అంతర్గత వ్యవహారమన్నారు. అభ్యర్థిని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటిస్తారని తెలిపారు. మునుగోడు ప్రచారానికి వెళ్తానని ప్రియాంక గాంధీతో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు కూడా చెప్పానని అన్నారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇంటికి వెళ్లిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క..దాదాపు గంట పాటు చర్చించారు. ఈ సందర్భంగా మునుగోడు అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ పార్టీలో జరిగిన కసరత్తుపై కోమటిరెడ్డికి వివరించానని భట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్ ఆశావహుల పేర్లను తెలియజేశానన్నారు. ఈ విషయంపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన అభిప్రాయాన్ని వెల్లడించినట్లు చెప్పారు.