మొయినాబాద్ ఫాంహౌస్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి. మీరు చేశారు అంటే మీరు చేశారు అంటూ దేవుని ప్రమాణాల వరకు వెళ్తున్నారు. తాజాగా మొయినాబాద్ ఫామ్‌హౌస్ వ్యవహారంపై బీజేపీ నేత విజయశాంతి సోషల్ మీడియా వేదికగా కేసీఆర్ పై విమర్శలు చేశారు.
“కేసీఆర్ గారి వింత విచిత్ర విన్యాసం వారి మాటల్లోనే చెప్పాలంటే… కత్తి బీజేపీది కాదు… నెత్తి బీజేపీది కాదు. దొరికిన అందరూ టీఆర్ఎస్ వాళ్ళే… నడిపించిన మొత్తం కథ కూడా వాళ్లదే… అయ్య ఆణిముత్యం చేసిన ప్రయోగాన్ని సమర్ధించుకోలేక… స్వయంగా కుమారుల వారే టీఆర్ఎస్ నుండి ఎవరు మాట్లాడొద్దని పోస్ట్ ఇచ్చారు. (మాట్లాడిన కొద్ది వారి మోసం ఎక్కువ బయట పడతదనే అనుమానంతో…)
స్టేట్ పోలీస్ టీఆర్ఎస్దే… ఏసీబీ కూడా వారి నియంత్రణే… దొరికిన డబ్బు ఆధారాలు చూపట్లేదు. బీజేపీ పేరు పెట్టవలసిన అవసరం ఈ తల తక్కువ కేసులో అంతకన్నా లేదు. అందుకే, న్యాయం కోసం బీజేపీ హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. అధ్వాన్నపు ప్రయత్నం అవకతవకగా చేసి, టీఆర్ఎస్ అడ్డగోలుగా ఈ ప్రయత్నంలో దొరికిపోయినట్టుగా తెలంగాణ ప్రజలు అభిప్రాయపడుతుండటం ప్రస్తుతం నడుస్తున్న పరిణామం”. అంటూ విమర్శించారు.
మొత్తానికి ఎమ్మెల్యేలా కొనుగోలు వ్యవహారంపై కేటీఆర్ చేసిన ట్వీట్ వల్ల బీజేపీ నేతలకు అయుధం చిక్కినట్లు కనపడుతోంది. ఓటు నోట్ల వ్యవహారం అనేది ఇప్పట్లో తెలియకపోయిన బీజేపీ-టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం మాత్రం అదుపుతప్పుతోంది.