కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ తాను మునుగోడులో జరిగే ఉప ఎన్నికలకు పూర్తి దూరంగా ఉంటున్నట్టు ప్రకటించారు. మునుగోడు ఉపఎన్నికలు అన్ని ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
ఉపఎన్నికలకు సంబంధించి తానకు తన పార్టీ నుండి ఎటువంటి సమాచారం లేదన్నారు. మునుగోడు నియోజకవర్గం చండూరులో జరిగిన బహిరంగ సభలో అసభ్యంగా తిట్టించారని, హోంగార్డుతో పోల్చి అవమానించారన్నారు. నన్ను పార్టీ నుండి వెళ్లగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని అవేదన వ్యక్తం చేశారు.
ఒకవైపు సొంత తమ్ముడు.. మరో వైపు మూడు దశాబ్ధాలకు పైగా కాంగ్రెస్ పార్టీతో అనుబంధం..ఎటూ తేల్చుకోలేక నలిగిపోతున్న వెంకటరెడ్డిని తాజా పరిణామాలు మరింత బాధిస్తున్నాయి. తమ్ముడితో విజయం కోసం మునుగోడు వెళ్తారా లేక కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ అవమానలు అనుభవిస్తారా అంటూ అనుచరులు బాధపడుతున్నారు.
కోమటి రెడ్డి వెంకట రెడ్డి బీజేపీలోకి వస్తే మాత్రం బీజేపీ విజయం నలేరు మీద నడకనే అంటూన్నారు బీజేపీ వర్గాలు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పాత తరం కాంగ్రెస్ పార్టీ దాదాపు కనుమరుగవుతోంది. కోమటి రెడ్డి తాజ మాటలు వింటూంటే కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.