మహేష్ డైలాగ్ తో తెలంగాణ పోలీసుల ప్రచారం

ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా, ఎటువైపు చూసిన పాజిటివ్ కేసులే. దీంతో మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలంటూ దేశవ్యాప్తంగా ప్రచారం ఊపందుకుంది. ఎవరికి తోచిన రీతిలో వాళ్లు మాస్క్ ఆవశ్యకతను వివరిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇందులో…

ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా, ఎటువైపు చూసిన పాజిటివ్ కేసులే. దీంతో మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలంటూ దేశవ్యాప్తంగా ప్రచారం ఊపందుకుంది. ఎవరికి తోచిన రీతిలో వాళ్లు మాస్క్ ఆవశ్యకతను వివరిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ పోలీసులు ఓ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చారు. మహేష్ బాబు సినిమా డైలాగ్ ను మాస్క్ కోసం వాడుకున్నారు.

“జీవితం అనేది ఒక యుద్ధం, దేవుడు మనల్ని వార్ జోన్ లో పడేశాడు. బీ ఎలర్ట్, ప్రొటక్ట్ యువర్ సెల్ఫ్.” అంటూ ఓ సినిమాలో మహేష్ బాబు చెప్పిన డైలాగ్ ను తెలంగాణ పోలీసులు హైలెట్ చేశారు. దీనికి వేర్ మాస్క్, మాస్క్ ఈజ్ మస్ట్ అనే హ్యాష్ ట్యాగ్స్ ను జోడించి ప్రచారం చేస్తున్నారు.

పోలీసులు చేస్తున్న ఈ సోషల్ మీడియా ప్రచారం చాలామందిని ఎట్రాక్ట్ చేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో మాస్క్ ఎంత అవసరమో తెలియజెప్పేలా ఉన్నాయి మహేష్ సినిమా డైలాగులు. ఈ ప్రచారానికి మంచి రెస్పాన్స్ వస్తోంది.

కరోనాపై పోరాటంలో భాగంగా మహేష్ ఇప్పటికే తనవంతు సహకారాన్ని అందిస్తున్నాడు. ఎప్పటికప్పుడు కరోనాకు సంబంధించి ప్రజలకు అవసరమైన సమాచారాన్ని షేర్ చేస్తున్నాడు. రీసెంట్ గా ప్లాస్మా దానానికి సంబంధించి సైబరాబాద్ పోలీసులు పెట్టిన పోస్టును కూడా రీట్వీట్ చేశాడు.

తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కొత్తగా గడిచిన 24 గంటల్లో 7432 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఒక రోజులో నమోదైన కేసుల్లో అత్యథికం ఇదే. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,87,106కు చేరుకుంది. దీంతో అంతా విధిగా మాస్కులు ధరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది.