ఉత్తరాంధ్రావాసులకు అక్కడ నో ఎంట్రీ

మొత్తానికి కరోనా ఎంతటి కఠినమైనది అన్నది ఆచరణలో తెలిసివస్తోంది. కరోనా మహమ్మారి ముందు బంధాలు సంబంధాలు అన్నీ కూడా పూర్తిగా కనుమరుగే అన్నది కూడా వాస్తవంలో తేటతెల్లమవుతోంది. Advertisement ఉత్తరాంధ్రా జిల్లాలు ఒడిషా రాష్ట్రాన్ని…

మొత్తానికి కరోనా ఎంతటి కఠినమైనది అన్నది ఆచరణలో తెలిసివస్తోంది. కరోనా మహమ్మారి ముందు బంధాలు సంబంధాలు అన్నీ కూడా పూర్తిగా కనుమరుగే అన్నది కూడా వాస్తవంలో తేటతెల్లమవుతోంది.

ఉత్తరాంధ్రా జిల్లాలు ఒడిషా రాష్ట్రాన్ని ఆనుకుని ఉంటాయి. ఇక్కడ నుంచి ఎంతో మంది ఉద్యోగ వ్యాపార ఇతర సంబంధాల రిత్యా ఒడిషా వెళ్తూంటారు. ఇక శ్రీకాకుళం జిల్లాకు అయితే ఒడిషా పక్కనే ఉంటుంది.

ఉత్తరాంధ్రాలో కరోనా కేసులు ఎక్కువ కావడంతో మీరు మా వైపు రావద్దు అంటూ ఓడిషా అధికారులు ఏకంగా నో ఎంట్రీ బోర్డులు పెట్టేశారు. నిజానికి కేంద్రం అంతర్రాష్ట్ర రవాణా మీద ఏ రకమైన నిబంధనలను పెట్టలేదు. కానీ ఒడిషా అధికారులు మాత్రం ముందే మేలుకున్నట్లుగా  కఠినమైన ఆంక్షలే అమలు చేస్తున్నారు.

దీంతో ఉత్తరాంధ్రా జిల్లా నుంచి ఒడిషా వైపు రాకపోకలు పూర్తిగా బంద్ అయిపోయాయి. అటు వైపు వారు ఇటు రాలేని స్థితి ఉంటే ఇటు పక్కలకు వచ్చినా వారు ఇక్కడే ఉండాల్సి వస్తోంది. మొత్తానికి అన్నదమ్ముల్లా ఉన్న మా అనుబంధానికి కరోనా కంచె కట్టేసింది అని సరిహద్దు జిల్లాల జనం వాపోతున్నారు.