Advertisement

Advertisement


Home > Politics - Telangana

కేటీఆర్ సారూ.. ఈ ముచ్చట విన్నారా?

కేటీఆర్ సారూ.. ఈ ముచ్చట విన్నారా?

వర్షం పడితే హైదరాబాద్ నరకంగా మారుతుంది. ఏడాదిన్నర క్రితం హైదరాబాద్ లో వచ్చిన వరదల వల్ల వేలాది మంది హైదరాబాదీలు ఇళ్లు, వాహనాలు కోల్పోయారు. ఆస్తినష్టం జరిగింది. ఆ ప్రభావం జీహెచ్ఎంసీ ఎన్నికలపై స్పష్టంగా కనపడింది. కానీ హైదరాబాద్ మేయర్ పీఠం నిలబెట్టుకుంది టీఆర్ఎస్. కట్ చేస్తే నిన్న, ఈరోజు మళ్లీ వర్షాలు పడుతున్నాయి. అదే సీన్ రిపీటైంది. ఊరూ ఏరూ ఏకమైంది. రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి.

ఈ వర్షాలకు సరిగ్గా కొన్ని రోజుల ముందు ఆంధ్ర ఫ్రెండ్ అంటూ ఏపీపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ వర్షాలతో కేటీఆర్ వ్యాఖ్యలు మరోసారి తెరపైకొచ్చాయి. ఏపీ రోడ్లు, కరెంట్ సంగతి తర్వాత చూద్దువుగానీ.. ముందు హైదరాబాద్ లో నీళ్ల కింద ఉన్న రోడ్లను ఉద్ధరించండి సారూ అనే కౌంటర్లు సోషల్ మీడియాలో హైలెట్ అవుతున్నాయి.

హైదరాబాద్ రోడ్లపై నడవలేకపోతున్నామంటూ నీకు ఆంధ్ర ఫ్రెండ్ చెప్పలేదా కేటీఆర్ అంటూ సోషల్ మీడియాలో మంత్రిగారిపై కౌంటర్లు పడుతున్నాయి. మరికొందరు మరో అడుగు ముందుకేసి, "హైదరాబాద్ లో రోడ్డు మీద పారుతున్న నదిలో కొట్టుకుపోయి మూసీ మురుక్కాలవలో తేలిన కేటీఆర్ ఫ్రెండ్" అంటూ సెటైర్లు వేస్తున్నారు.

వాస్తవానికి హైదరాబాద్ సుందర నగరమే. కానీ వాన పడితేనే దాని అసలు రంగు బయటపడుతుంది. గురివింద గింజ తన కింద ఉన్న నలుపుని చూడకుండా.. పొరుగు రాష్ట్రంపై సెటైర్లు పేలుస్తోంది. ఈరోజు ఉదయాన్నుంచి హైదరాబాద్ వర్షాల గురించి మీడియాలో వస్తున్న దృశ్యాలు చూస్తుంటే పాలకుల నిర్లక్ష్యం ఎంతలా ఉందో అర్థమవుతుంది.

కాళేశ్వరం కట్టాం, యాదాద్రి పునర్నిర్మించామంటూ జబ్బలు చరుచుకోవడం కాదు, అంతర్జాతీయ నగరం అంటూ టీఆర్ఎస్ లీడర్లు ఘనంగా చెప్పుకుంటున్న హైదరాబాద్ లో వర్షం పడినా కూడా రోడ్డుపై వాహనంలో సాఫీగా వెళ్లగలమనే ధైర్యం ప్రజల్లో ఉన్నప్పుడే టీఆర్ఎస్ పాలనకు ఓ అర్థం ఉంటుంది. అది లేనంతకాలం.. నిధులు, నీళ్లు, నియామకాలంటూ ఎంత చెప్పుకున్నా ఉపయోగం ఉండదు. ఎందుకంటే, తెలంగాణకు హైదరాబాదే ఆయువు పట్టు. దాన్ని సరిగ్గా చూసుకోలేకని పాలన ఎందుకు?

విశ్వనగరానికి ఎందుకీ దుస్థితి..

ఇటీవలే జీవో 111 ఉపసంహరణ పెద్ద దుమారానికి కారణం అయింది. నీటి వనరులను రక్షించాల్సిన ప్రభుత్వాలు ఆ పని చేయడం మానేశాయి. నగరీకరణ పేరుతో నీటి వనరుల్ని ఆక్రమించుకునేందుకు ఇచ్చిన వెసులుబాటే జీవో 111 ఉపసంహరణ. హైదరాబాద్ నేటి దుస్థితి చూస్తే.. ఇలాంటి నిర్ణయాల వల్ల భవిష్యత్తులో మరెన్ని ఉపద్రవాలు వస్తాయో అని భయపడాల్సిన పరిస్థితి.

ఎక్కడికక్కడ చెరువులు, నీటి వనరులు ఆక్రమించి.. డ్రైనేజీలు, నల్లాల రూటు మార్చి చేసిన తప్పిదాల వల్లే ఇప్పుడీ అవస్థలన్నీ. ప్రజలను కేవలం ఓటర్లుగానే పరిగణించడం వల్ల వచ్చిన దుస్థితి ఇదంతా. ఆక్రమణలు తొలగిస్తే ఓట్లు కోల్పోతామనే భయం. మరోవైపు ఆమ్యామ్యాలకు కక్కుర్తిపడి రియల్ ఎస్టేట్ బిల్డర్లకు విచ్చలవిడిగా ఇచ్చిన అనుమతులు చివరకు నగరాన్ని ఈ దుస్థితికి తీసుకొచ్చాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?