Advertisement

Advertisement


Home > Politics - Telangana

అరెస్టుకు సై.. ఇతర ట్విస్టులే విచిత్రం!

అరెస్టుకు సై.. ఇతర ట్విస్టులే విచిత్రం!

కల్వకుంట్ల కవిత అరెస్టు జరుగుతుందో లేదో గానీ.. ఇప్పుడు వాతావరణం గమనిస్తోంటే.. ఒకవేళ ఆమెను అరెస్టు చేయకుండా వదిలేస్తే.. రాష్ట్రంలోని గులాబీ దళాలు నిరాశపడేలా కనిపిస్తోంది. ఎందుకంటే.. కవితను అరెస్టు చేస్తే.. భారతీయ జనతా పార్టీ మీద ఎలా విరుచుకుపడాలి... ఎలాంటి నిరసనలతో దేశం దృష్టిని ఆకర్షించాలి.. దేశం అట్టుడికేలా ఎలా చేయాలి.. లాంటి రకరకాల కార్యచరణ ప్రణాళికలను గులాబీ పార్టీ సిద్ధం చేసుకుంది. 

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా మానసికంగా తన కుమార్తె అరెస్టుకు సిద్ధం అయ్యారు. పరిస్థితులు ఎలా వచ్చినా ఎదుర్కోవాలని డిసైడ్ అయ్యారు. కవిత అరెస్టు అంటూ జరిగితే.. దాని ద్వారా దేశవ్యాప్తంగా బీభత్సంగా మైలేజీ పొందడానికి అల్రెడీ ప్రణాళికలు సిద్ధం చేసినట్టే ఉంది. కవిత ఢిల్లీలో శనివారం ఈడీ ఎదుట హాజరు కాబోతుండగా.. ఈ వ్యవహారాలపై అంత ఎక్కువగా మాట్లాడి ఎరగని కేటీఆర్ కూడా.. శుక్రవారం బయల్దేరి ఢిల్లీ వెళ్లారు. పార్టీలో బాగా హైప్ క్రియేట్ అయింది. 

కేసీఆర్ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ.. రేపు కవితను అరెస్టు చేస్తారు. ఏం చేస్తారో చేసుకోనివ్వండి. బిజెపిలో చేరని వారిని వేధిస్తున్నారు. ఇప్పటికే భారాస వారిని పలువురిని వేధించారు. ఇప్పుడు కవితదాకా వచ్చారు.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చూడబోతే గులాబీదళాలన్నీ రకరకాల రాజకీయ కారణాల నేపథ్యంలో కవిత అరెస్టును కోరుకుంటూ ఉండవచ్చు గానీ.. శనివారం నాడే ఆ  అరెస్టు జరుగుతుందా లేదా అనేది డైలమాలో పడింది. 

తాను కవిత బినామీని అన తన వాంగ్మూలంలో పేర్కొన్న అరుణ్ రామచంద్ర పిళ్లై ట్విస్టు ఇచ్చారు. సుప్రీంకోర్టులో ఆయన కొత్త పిటిషన్ వేశారు. తాను సీబీఐకు ఇచ్చిన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు అందులో పేర్కొన్నారు. అంటే కవిత బినామీ తానే అనే మాటను వెనక్కు తీసుకుంటున్నారన్నమాట. దీంతో వేడి కాస్త చల్లబడ్డట్టే. 

కానీ ఈడీ విచారణ, ఈ ఒక్క కారణం చేత, తేలిపోయే అవకాశం తక్కువే. ఎందుకంటే రామచంద్ర పిళ్లై , కవిత ఇద్దరినీ ఏకకాలంలో విచారించి నిగ్గు తేల్చబోతున్నారు. పైగా సిసోడియా వాంగ్మూలంలో కూడా కవిత పేరు ప్రస్తావనకు వచ్చినట్టుగా చెబుతున్నారు. సిసోడియాను కూడా ఈడీ తమ కస్టడీలోకి తీసుకుని ఉంది. దీంతో ఈ సిటింగులో కవిత విచారణతో చాలా కీలక పరిణామాలు జరుగుతాయని అనుకోవచ్చు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?