Advertisement

Advertisement


Home > Politics - Telangana

సొంతగూటికి సంజయ్, డీఎస్!

సొంతగూటికి సంజయ్, డీఎస్!

సీనియ‌ర్ నేత డీ. శ్రీనివాస్ మళ్లీ సొంతగూటికి చేరనున్నారు. నేడు మాణిక్ రావు ఠాక్రే, రేవంత్ రెడ్డి స‌మ‌క్షంలో కాంగ్రెస్ కండువా క‌ప్పుకోనున్నారు. డీఎస్ తో పాటు ఆయ‌న కుమారుడు, నిజామాబాద్ మాజీ మేయ‌ర్ సంజ‌య్ కూడా హ‌స్తం పార్టీలో చేర‌నున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లో నెంబర్ 2గా పేరున్న నేత ధర్మపురి శ్రీనివాస్ (DS). రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతగా డీఎస్ కు పేరుంది. తృటిలో డీఎస్ కు సీఎం కుర్చీ మిస్సయ్యిందని కాంగ్రెస్ నేతలు ప్రస్తావించేవారు. 2 సార్లు కాంగ్రెస్ రాష్ట్ర అధ్య‌క్షుడిగా, మంత్రిగా ప‌నిచేశారు. 2014 తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో ఆయ‌న బీఆర్ఎస్ లో చేరారు. ఆ తర్వాత రాజ్యసభ పదవి ల‌భించింది.

గ‌త కొంత కాలంగా బీఆర్ఎస్ పార్టీలో తగిన ప్రాధాన్యత లభించకపోవటంతో పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ప్రస్తుతం డీఎస్ రాజ్యసభ పదవీ కాలం కూడా ముగిసింది. తనకు పొలిటికల్ కెరీర్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీతోనే తన ప్రయాణం కొనసాగాలని డీఎస్ నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో చ‌ర్చించిన త‌ర్వాత‌ సోంతగూటికి చేర‌బోతున్నారు. కాగా డీఎస్ మ‌రో కుమారుడు అర్వింద్ నిజామాబాద్ బీజేపీ ఎంపీగా ఉన్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?