Advertisement

Advertisement


Home > Politics - Telangana

హైదరాబాద్ లో మల్టీప్లెక్స్ బిజినెస్.. సీన్ రివర్స్?

హైదరాబాద్ లో మల్టీప్లెక్స్ బిజినెస్.. సీన్ రివర్స్?

మహేష్ బాబుకు ఆల్రెడీ ఓ మల్టీప్లెక్స్ ఉంది. ఇక అల్లు అర్జున్ కూడా ఓ మల్టీప్లెక్స్ రెడీ చేశాడు. ఇలా హీరోలు కూడా రంగంలోకి దిగే స్థాయిలో హైదరాబాద్ లో మల్టీప్లెక్స్ కల్చర్ ఊపందుకుందని, ఇకపై సింగిల్ స్క్రీన్స్ కనిపించవంటూ చాలా కథనాలు చదువుకున్నాం. కానీ కరోనా తర్వాత అంత సీన్ లేదనిపిస్తోంది.

కరోనా తర్వాత ప్రేక్షకుల మైండ్ సెట్ పూర్తిగా మారిపోయింది. ఆహా..ఓహో అనిపించే కంటెంట్ కోసం మాత్రమే థియేటర్లకు వస్తున్నారు, లేదంటే స్టార్ హీరోల సినిమాల ఓపెనింగ్స్ కు (రిజల్ట్ తో సంబంధం లేకుండా) మాత్రమే ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. అంతకుమించి మల్టీప్లెక్సుల్లో ఊపు కనిపించడం లేదు. వీకెండ్ కాకుండా, సాధారణ రోజుల్లో మల్టీప్లెక్సుల్లో అడుగుపెడితే షాపులన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి, స్క్రీన్స్ వెలవెలబోతున్నాయి.

ఇప్పుడీ రివర్స్ ట్రెండ్ కు అంకెలు జోడించింది హైదరాబాద్ మహానగర పాలక సంస్థ. కరోనా తర్వాత హైదరాబాద్ లో మల్టీప్లెక్స్ నిర్మాణాలు పూర్తిగా పడిపోయాయని స్వయంగా గ్రేటర్ హైదరాబాద్ అధికారులు చెబుతున్నారు.

2021 నుంచి ఇప్పటివరకు ఈ రెండేళ్లలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మల్టీప్లెక్సుల నిర్మాణం కోసం కేవలం 4 అప్లికేషన్లు మాత్రమే వచ్చాయట. వాటికి అనుమతులివ్వగా, అందులో 3 మాత్రమే ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి. ఇక 2020లోనైతే కేవలం ఒకే ఒక్క అప్లికేషన్ వచ్చిందని చెబుతున్నారు.

కరోనాకు ముందు 2016-19 మధ్య కాలంలో ఏడాదికి కనీసం 8 అప్లికేషన్లు వచ్చేవని, ఇప్పుడు సీన్ రివర్స్ అయిందని చెబుతున్నారు.

హైదరాబాద్ లో, మరీ ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో ఇప్పటికీ మల్టీప్లెక్స్ బిజినెస్ ఊపందుకోలేదు. చాలా ప్రాంతాల్లో కేవలం స్క్రీన్స్ మాత్రమే నడుస్తున్నాయి, వాటికి అనుబంధంగా వెలసిన ఎన్నో షాపులు క్లోజ్ అయ్యాయి. చాలా ప్రాంతాల్లో ఒకటి, రెండు అంతస్తులు ఖాళీగా ఉంటున్నాయి. 3-4 అంతస్తుల్లో స్క్రీన్స్, ఫుడ్ జోన్ లాంటివి నడిపిస్తున్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?