Advertisement

Advertisement


Home > Politics - Telangana

బీజేపీ ఎంపీ గారి 'బోర్డు' అంటూ సెటైర్లు!

బీజేపీ ఎంపీ గారి 'బోర్డు' అంటూ సెటైర్లు!

నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డును ఏర్పాటుచేసే ప్రతిపాదన లేదని కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ పార్లమెంటులో చేసిన ప్రకటనతో గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు విన్నూత రీతిలో నిర‌స‌న తెలిపారు. ఇది మా ఎంపీ గారు తెచ్చిర ప‌సుపు బోర్డు అంటూ ప‌సుపు రంగు ఫ్లెక్సీల‌ను నిజామాబాద్, ఆర్మూర్, బోధ‌న్, బాల్కొండ‌లోని కూడ‌ళ్ల‌లో ప్ర‌ద‌ర్శించారు.

కాగా, 2019 పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో బీజేపీ త‌ర‌పున పోటీ చేసిన ధర్మపురి ఆర్వింద్.. త‌న‌ను గెలిపిస్తే 5 రోజుల్లో ప‌సుపు బోర్డు తెప్పిస్తాన‌ని బాండ్ పేప‌ర్ రాశారు. పసుపు బోర్డు తీసుకురాకపోతే రాజీనామా చేస్తానని అర్వింద్ ఎన్నికల సమయంలో తెలిపారని, మరి నాలుగున్నరేండ్లు గడిచినా బోర్డు సాధించలేకపోతే ఎందుకు రాజీనామా చేయడం లేదని ఇప్ప‌టికే రైతులు ప్ర‌శ్నిస్తున్నారు.

గురువారం పార్ల‌మెంట్ లో బీఆర్ఎస్ ఎంపీలు ఆడిగిన ప్ర‌శ్న‌ల‌కు కేంద్ర మంత్రి అనుప్రియ ప‌టేల్ లిఖిత‌పూర్వ‌కంగా స‌మాధానం ఇస్తూ.. సుగంధ ద్రవ్యాల బోర్డు చట్టం-1986 ప్రకారం ఏర్పాటు చేసిన స్పైసెస్ బోర్డు, పసుపు, కొత్తిమీర, మిరపకాయలతో సహా 52 సుగంధ ద్రవ్యాలను ప్రోత్సహించే బాధ్యతను రాష్ట్రాలకు అప్పగించినట్లు తెలిపారు. పసుపు బోర్డును ఏర్పాటు చేసే ప్రతిపాదన లేదని కేంద్ర మంత్రి పార్లమెంటులో తేల్చి చెప్పారు.

ఎంపీగా గెలిచినప్పటి నుంచి ఇప్పటివరకూ కూడా పసుపు బోర్డు ఊసు ఎత్తలేదు ఎంపీ అర్వింద్. తరచూ జిల్లా పర్యటన సమయంలో రైతులు, పార్లమెంట్ వేదికగా ప్రతిపక్షాలు, రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నా.. అదిగో ఇదిగో అంటూ మాట దాటవేస్తున్నారే కానీ సరైన స్పష్టత ఇవ్వడం లేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?