Advertisement

Advertisement


Home > Politics - Telangana

ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్.. బీఆర్ఎస్ కు అస్త్రం

ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్.. బీఆర్ఎస్ కు అస్త్రం

ఎన్నికలు తరుముకొస్తున్న వేళ.. బీఆర్ఎస్-బీజేపీ మధ్య పొలిటికల్ వార్ ఏ రేంజ్ లో జరుగుతుందో చూస్తూనే ఉన్నాం. వాళ్లు ఒకటంటే, వీళ్లు రెండు అంటున్నారు. వాళ్లు ఒక ఆరోపణ చేస్తే, వీళ్లు పది మంది కలిసి దాన్ని తిప్పికొడుతున్నారు. ఇలా రోజూ బీఆర్ఎస్-బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది.

ఇప్పుడీ రాజకీయాల కోసం ఆర్ఆర్ఆర్ ను కూడా వాడుకోడానికి సిద్ధమైనట్టుంది బీఆర్ఎస్ పార్టీ. మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ నుంచి ఆస్కార్ అవార్డుల కోసం ఓ సినిమాను పంపించారని, ఆర్ఆర్ఆర్ ను కావాలనే నిర్లక్ష్యం చేశారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. స్వయంగా తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని ఈ వ్యాఖ్యలు చేశారు.

"బాహుబలితోనే రాజమౌళి ఓ బ్రాండ్ క్రియేట్ చేశాడు. తెలుగు సినిమాను విశ్వవ్యాప్తం చేశాడు. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ వచ్చింది. అది కూడా విశ్వవ్యాప్తమైంది. ఇంత చరిత్ర ఉన్నప్పటికీ ఆస్కార్ కు అధికారిక ఎంట్రీ కింద గుజరాత్ కు చెందిన ఓ చిన్న సినిమాను పంపించారు. దక్షిణ భారతదేశం అంటే వాళ్లకు వివక్ష. అందుకే ఆర్ఆర్ఆర్ ను పంపించలేదు."

నిజానికి గుజరాత్ కు చెందిన సినిమాను ఆస్కార్ ఎంట్రీకి ఎంపిక చేసినప్పుడే సౌత్-నార్త్ వివక్షపై చాలా కథనాలు, విశ్లేషణలు, చర్చలు జరిగాయి. ఆస్కార్ బరిలో గుజరాత్ సినిమా నామినేట్ కాలేదు, ఆర్ఆర్ఆర్ నామినేట్ అయింది. ఇప్పుడు ఏకంగా అవార్డ్ కూడా సొంతం చేసుకుంది.

దీంతో బీఆర్ఎస్ నేతలు మరోసారి ఆర్ఆర్ఆర్ కేంద్రంగా తమ మాటలకు పదును పెడుతున్నారు. చూస్తుంటే.. "ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్" అనే అంశం రాబోయే రోజుల్లో రాజకీయ అస్త్రంగా కూడా మారేలా ఉంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?