Advertisement

Advertisement


Home > Politics - Telangana

అన్నిటికి యాక్ట్ ఆఫ్ గాడ్ నే...!

అన్నిటికి యాక్ట్ ఆఫ్ గాడ్ నే...!

ఏ చిన్న అవకాశం వచ్చిన బీజేపీ పై సెటైర్ వేయడంలో అందరి కంటే ముందు వరుసలో ఉంటారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. దేశంలో ఎక్కడ సమస్య కనపడిన ట్విట్టర్ వేదికగా విమర్శిస్తుంటారు. కెసిఆర్ కేంద్ర రాజకీయాలకు వెళ్తుండమ్ తో తెరాస- బీజేపీ నాయకుల విమర్శలు, ప్రతి విమర్శలు నడుస్తూనేఉన్నాయి.

తాజాగా దేశ కరెన్సీ రోజు రోజుకి దిగజాతుండటంతో కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. 'రూపాయి వాల్యూ రోజురోజుకూ పడిపోతుంటే... ఆర్థిక మంత్రి మాత్రం రేషన్ షాపుల దగ్గర మోడీ ఫోటోలు వెతకడంలో బిజీగా ఉన్నారని, ఆర్థిక సమస్యలు, నిరుద్యోగం, అధిక ద్రవ్యోల్బణం ఇవన్నీ యాక్ట్స్ ఆఫ్ గాడ్ గా చెప్పినా చెప్తారని, రూపాయి విలువ సాధారణంగానే పడిపోయిందని కేంద్రమంత్రి అంటున్నారని' నిర్మల సీతారామన్ తీరుపై ఫైర్ అయ్యారు కేటీఆర్ 

గత నెలలో తెలంగాణాలో పర్యటించిన ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఒక రేషన్ షాప్ లో ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో లేకపోవడంతో కలెక్టర్ ను ప్రశ్నించడంతో టీఆర్ఎస్ - బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడిచాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?