Advertisement

Advertisement


Home > Politics - Telangana

ప‌వ‌న్ సినిమాలో విల‌న్ పాత్ర‌ ఆఫర్ చేశారుః మంత్రి

ప‌వ‌న్ సినిమాలో విల‌న్ పాత్ర‌ ఆఫర్ చేశారుః మంత్రి

సినిమాలంటే ఆస‌క్తి లేనిదెవ‌రికి? సినిమా ప‌రిశ్ర‌మ‌కు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ వుంది. రాజ‌కీయాల్లో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై భిన్నాభిప్రాయాలున్నాయి. ప‌వ‌న్ సీరియ‌స్ పొలిటీషియ‌న్ కాద‌నేది మెజార్టీ అభిప్రాయం. అందుకే పార్టీ స్థాపించి  ప‌దేళ్లైనా ఇప్ప‌టికీ ప‌వ‌న్‌కల్యాణ్ అసెంబ్లీలో అడుగు పెట్ట‌లేద‌నే మాట బ‌లంగా వినిపిస్తోంది. సినిమాల్లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ స‌క్సెస్ ఫుల్ యాక్ట‌ర్‌. టాలీవుడ్ అగ్ర‌హీరోగా ప‌వ‌న్‌కు ఓ రేంజ్‌లో అభిమానులున్నారు.

ప‌వ‌న్ సినిమాల్లో న‌టించే అవ‌కాశం కోసం చాలా మంది న‌టులు ఎదురు చూస్తుంటారు. అలాంటిది క్యారెక్ట‌ర్ ఏదైనా, ప‌వ‌న్ సినిమాలో న‌టించే అవ‌కాశం వ‌స్తే ఎగిరి గంతేయ‌ని వారుంటారా? ఉంటార‌నే స‌మాధానం వ‌స్తోంది. తెలంగాణ మంత్రి మ‌ల్లారెడ్డి త‌న‌కు ప‌వ‌న్ సినిమాలో విల‌న్ పాత్ర పోషించే అవ‌కాశం వ‌చ్చిన‌ట్టు చెప్పారు. హైద‌రాబాద్‌లో ఆదివారం "మేమ్ ఫేమ‌స్" టీజ‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథిగా మంత్రి మ‌ల్లారెడ్డి పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి ప్ర‌సంగిస్తూ ప‌వ‌న్ సినిమాలో విల‌న్‌గా న‌టించాల‌ని ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్ త‌న‌ని కోరార‌న్నారు. త‌న‌ను గంట‌న్న‌ర సేపు బ‌తిమిలాడార‌ని, అయినా తాను అంగీక‌రించ‌లేద‌ని మంత్రి చెప్పారు. ఈ సినిమా టీజ‌ర్ త‌న‌కెంతో బాగా న‌చ్చింద‌న్నారు. సినిమా త‌ప్ప‌కుండా హిట్ అవుతుంద‌న్నారు.

ఇది స‌క్సెస్ అయిన త‌ర్వాత ఈ హీరోతో తానొక సినిమా చేస్తాన‌ని మంత్రి చెప్పారు. అసెంబ్లీ ఎన్నిక‌లు పూర్త‌యిన త‌ర్వాత సినిమాలు నిర్మిస్తాన‌ని మంత్రి చెప్ప‌డం విశేషం. జీవితంలో పైకి రావాలంటే షార్ట్ క‌ట్స్ వుండ‌వ‌న్నారు. జీవితంలో క‌ష్ట‌ప‌డితేనే ఉన్న‌త స్థానానికి చేరుకుంటార‌ని, ఇందుకే త‌నే నిలువెత్తు ఉదాహ‌ర‌ణగా మంత్రి మ‌ల్లారెడ్డి చెప్పుకొచ్చారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?