Advertisement

Advertisement


Home > Politics - Telangana

లాజిక్ మరచి సీక్రెట్ బయటపెట్టిన గుంటకండ్ల

లాజిక్ మరచి సీక్రెట్ బయటపెట్టిన గుంటకండ్ల

తమలోని పలాయవాదాన్ని, బేరాలు చెడిన సంగతిని కూడా దాచిపెట్టి బుకాయించగలమని వారికి ఒక నమ్మకం. అందుకే వైఫల్యాలను కూడా సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు. భారాస కీలక నాయకుల్లో ఒకరైన మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, కన్నడ ఎన్నికల్లో తమ పార్టీ ఎందుకు బరిలోకి దిగలేదో ఇప్పుడు వివరణ ఇస్తున్నారు. కర్ణాటక ఎన్నికల్లో భారాస పోటీచేయకపోవడం అనేది.. వ్యూహాత్మకం అని జగదీష్ రెడ్డి చెబుతున్నారు. ఆ వ్యూహం గురించి ఆయన ఇస్తున్న వివరణ  మాత్రం చాలా కామెడీగా ఉంది. 

కర్ణాటకలో భాజపా ప్రభుత్వాన్ని సాగనంపాలని అక్కడి ప్రజలు ముందుగానే నిర్ణయించుకున్నారట. అందువల్ల అక్కడ తమ పార్టీ పోటీచేస్తే.. భాజపాకు మేలు జరుగుతుందని వీరు భావించారట.. అందుకే ఎన్నికలకు దూరంగా ఉన్నారట. 

ఈ మాటల్లో లాజిక్ ఏంటో ఎంతకూ అర్థం కావడం లేదు.. ఎందుకంటే.. భారాస అధినాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెబుతున్న ప్రకారం నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రజలకు ద్రోహం చేస్తోంది. మోడీని ఓడించాలని దేశ ప్రజలంతా కృతనిశ్చయంతో ఉన్నారు.

మరి, గుంటకండ్ల వారి భాష్యం ప్రకారం.. ఇలాంటి పరిస్థితుల్లో భారాస దేశం మొత్తం పోటీచేస్తే ఏం జరుగుతుంది. భాజపా వ్యతిరేక ఓటు చీలుతుంది కద! విజన్ ఉన్న నాయకుడిగా కేసీఆర్ కు దేశవ్యాప్తంగా తిరుగులేని ప్రజాదరణ ఉన్నదట. మరి అలాంటి ఆదరణతో ఆయన గరిష్టంగా ప్రతిచోటా ఓట్లు చీల్చుకుంటూ.. వారి లెక్కల ప్రకారం బిజెపిని ఛీకొడుతున్న ప్రజల ఓట్లే కదా చీలుతాయి! అంతిమంగా లాభపడేది బిజెపినే కదా! గుంటకండ్ల వారు ఈ లాజిక్ ను ఎలా మిస్సయినట్లు? అనే అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయి. 

కర్ణాటక ఎన్నికల్లో భారాస పోటీచేయకపోతే మానె.. కనీసం జాతీయ పార్టీ ఆలోచన చేస్తున్న నాటినుంచి.. కేసీఆర్ వెంట ఉంటూ.. ఆయనకు ఇతర రాష్ట్రాల్లో కూడా ఆదరణ ఉన్నదనే అభిప్రాయానికి నిదర్శనంగా నిలుస్తూ.. ప్రతి మీటింగుకు హాజరవుతూ కేసీఆర్ కు పూలబొకేలు, శాలువాలు సమర్పించుకున్న కుమారస్వామిని కన్నడ ఎన్నికల్లో అలా నడిసముద్రంలో వదిలేసినట్టుగా కేసీఆర్ ఎందుకు వదిలేశారో గుంటకండ్ల వారి వద్ద వివరణ ఉన్నదా? 

మోడీ వ్యతిరేక ఓటు చీలనివ్వరాదనుకున్నారు గనుక.. తాము పోటీచేయలేదు ఓకే, మరి కుమారస్వామికి మద్దతుగా అక్కడ ప్రచారం చేసి, తమ భారాసకు జై కొట్టిన పార్టీ గౌరవప్రదమైన ఓట్లు సాధించేందుకు ఉపయోగపడాలని వారికి ఎందుకు అనిపించలేదు? అన్నీ ప్రజల సందేహాలే.

గుంటకండ్ల వారు తన మాటల్లో ఎన్ని గారడీలనైనా ప్రదర్శించవచ్చు గాక.. కానీ ఈ పరిణామాలు ఆయన మాటలు మాత్రం.. బిజెపితో కుమ్మక్కు కావడం వల్లనే భారాస ప్రారంభించారనే వాదనకు బలం ఇస్తున్నాయి. దేశవ్యాప్తంగా భారాస పోటీచేసినా సరే... ప్రజల భావన మాత్రం అదే. ఆ సీక్రెట్ ను ఇండైరక్టుగా గుంటకండ్ల వారే బయటపెట్టారు.

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా