థమన్ మీద రూమర్లు ఇన్నీ అన్నీ కావు

టాలీవుడ్ లో హీరోల మీద హీరోయిన్ల మీద రూమర్లు వినిపించడం కామన్. మ్యూజిక్ డైరక్టర్ థమన్ మీద కూడా ఇటీవల ఎక్కువ గ్యాసిప్ లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇవన్నీ సరదా..సరదా గ్యాసిప్ లు…

టాలీవుడ్ లో హీరోల మీద హీరోయిన్ల మీద రూమర్లు వినిపించడం కామన్. మ్యూజిక్ డైరక్టర్ థమన్ మీద కూడా ఇటీవల ఎక్కువ గ్యాసిప్ లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇవన్నీ సరదా..సరదా గ్యాసిప్ లు కావడం విశేషం. 

థమన్ ఇప్పుడు వన్ అండ్ ఓన్లీ ఫుల్ బిజీ మ్యూజిక్ డైరక్టర్ తెలుగులో. కానీ అలా అని హమేషా ఆయన తన పని మీదే వుండడం లేదట. అదే సమస్య అంట సినిమాలకు.

క్రికెట్ అంటే థమన్ కు చాలా ఇష్టం. రోజూ ఏదో టైమ్ చూసుకుని క్రికెట్ ఆడాల్సిందే. ఒక్కోసారి తాను వుండే హోటల్ పై అంతస్తు కారిడార్ లోనే తన స్టాఫ్ ను బౌల్ చేయమని ప్రాక్టీస్ చేసేస్తుంటాడని టాలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు.

క్రికెట్ తరువాత థమన్ కు ఆహా ఇండియన్ ఐడియల్ కార్యక్రమం మీద బాగా ఆసక్తి పెరిగిపోయిందట. దాని కోసం రకరకాల డ్రెస్ లు ట్రయ్ చేయడం, సెలెక్ట్ చేయడంలో కాస్త ఎక్కువ టైమ్ నే ఖర్చు చేస్తున్నారట.

ఇదిలా వుంటే ఓ యువ దర్ళకుడు తన సినిమాకు ట్యూన్ లు త్వరగా ఇస్తారేమో అని థమన్ ను బాగా పాంపర్ చేస్తూ, వీలయినపుడల్లా పబ్ లకు పార్టీలకు తీసుకెళ్తున్నారట. కానీ అయినా కూడా ఇంకా ఓ ట్యూన్ కూడా పలకలేదట.

మహేష్, ప్రభాస్, బాలయ్య లాంటి పెద్ద హీరోల సినిమాలు వున్నాయి. కానీ ఇంకా ఏ ఒక్కరి సినిమాకు ఒక్క ట్యూన్ కూడా అందలేదని టాలీవుడ్ ఇన్ సైడ్ వర్గాల బోగట్టా.