మీనాక్షి.. మీనాక్షి.. ఏమయింది? ఇంతకీ?

విమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్ పదవికి మూడు పేర్లు అధిష్టానం దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది.

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ మీనాక్షి చౌదరిని ఏపీ విమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తున్నారని వార్తలు గుప్పుమన్నాయి. ‘కాదు కాదు’ ఫేక్ అని ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ అంటూ క్లారిటీ ఇవ్వడంతో చప్పబడ్డాయి. అసలు ఏం జరిగింది.? నిజమా..కాదా?

కొన్ని రోజుల క్రితం అంటే సుమారుగా ఓ వారం క్రితమే ఓ సినిమా సెలబ్రిటీ తెలుగుదేశం కీలక నేతను కలిసినపుడు ఈ డిస్కషన్ వచ్చింది. ఇమెను ఈ పదవిలో నియమిస్తున్నారనే వార్త ఆ సెలబ్రిటీకి తెలిసింది. అయితే ఆయన దానిని బయటకు వెల్లడించలేదు కానీ సదరు హీరోయిన్ సంబంధీకులకు తెలిపారు. అది అలా ఇండస్ట్రీలో సర్కిల్ లోకి వచ్చింది కానీ ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు.

మొన్న, నిన్న ఒక‌రోక‌రు దీనిని కోట్ చేయడం ప్రారంభించారు. దాంతో హడావుడి మొదలైంది. మరి ఎందుకు పక్కన పెట్టారు అన్నది ప్రశ్న. కింద స్థాయిలో ఎవరో నిర్ణయం తీసుకున్నారని, పై వరకు ఇంకా వెళ్లకుండానే బయటకు వచ్చిందని, అందుకే పక్కన పెట్టారని ఓ సమాచారం.

అసలు ఈ విమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్ పదవికి మూడు పేర్లు అధిష్టానం దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది.

ఒకటి మీనాక్షి చౌదరి, రెండు సాయి పల్లవి, మూడు రష్మిక. గమ్మత్తేమిటంటే ఈ ముగ్గురు తెలుగు వాళ్లు కాదు. ఏపీకి చెందిన వాళ్లు కాదు. మీనాక్షి చౌదరి మన చౌదరి కాదు. నార్త్‌లో ఉండే చౌధురి. అసలు నార్త్ చౌధురి అనే పదం గతంలో ఇలాగే రాసేవారు. కొన్నేళ్లుగా చౌధురి అని రాయాల్సి వచ్చినప్పుడ‌ల్లా చౌదరి అనే రాసేస్తున్నారు. అది వేరే సంగతి. మొత్తానికి మీనాక్షి చౌధురి ఢిల్లీకి చెందిన వారు. సాయి పల్లవి తమిళ/మలయాళీ ప్రాంతాలకు చెందిన వారు. రష్మిక కన్నడిగ.

కానీ ఈ మూడు పేర్లు సినిమా జనాలే తేదేపా అధిష్టానానికి సూచించడం విశేషం. వీరెవరికి మన తెలుగు అమ్మాయి. మంచి క్రేజ్ వున్న శ్రీలీల గుర్తుకు రాలేదు ఎందుకో. బహుశా చిన్న అమ్మాయి అని అనుకుని వుంటారు.

మొత్తం మీద ఏమయితేనేం మీనాక్షి పేరు ప్రస్తుతానికి పక్కన పెట్టారు. తరువాత ఏం చేస్తారో చూడాలి.

13 Replies to “మీనాక్షి.. మీనాక్షి.. ఏమయింది? ఇంతకీ?”

Comments are closed.