‘డ్రింకర్ సాయి’ ధర్మ కి సాక్షి అవార్డు

కొత్తగా మేకప్ వేసుకున్న కుర్రాడికి తొలి సినిమాతోనే కాస్త చెప్పుకోదగ్గ‌ అవార్డుతో గుర్తింపు వస్తే ఆనందమే కదా.

డ్రింకర్ సాయి అనే చిన్న సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ మేరకు ఆడింది అన్నది పక్కన పెడితే ఓ మంచి యువ నటుడిని తెరకు పరిచయం చేసింది. ఒడ్డు, పొడవు, హీరో మెటీరియల్ తో పాటు, మంచి నటన, ఈజ్ వుంది అనిపించుకున్నాడు ధర్మ అనే కొత్త కుర్రాడు.

ఈ కుర్రాడు జనాల దృష్టిలో పడ్డాడు. అందుకే ఇప్పుడు సాక్షి ఎక్స్ లెన్సీ అవార్డు దృష్టిలో కూడా పడ్డాడు. కొత్తగా మేకప్ వేసుకున్న కుర్రాడికి తొలి సినిమాతోనే కాస్త చెప్పుకోదగ్గ‌ అవార్డుతో గుర్తింపు వస్తే ఆనందమే కదా.

అదే రేంజ్ ఆనందం వ్యక్తం చేసాడు ధర్మ. కెరీర్ బిగినింగ్ లోనే తనకు సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్ రావడం ఎంతో ఎంకరేజింగ్ గా ఉందని హీరో ధర్మ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు గత ఏడాది థియేటర్లలోకి వచ్చింది డ్రింకర్ సాయి. ఈ సినిమా ప్రమోషన్లలో ధర్మ కావాలని కాస్త ఓవర్ దీ బోర్డ్ వెళ్లాడు. అలా అందరి దృష్టిని ఆకట్టుకున్నారు.

ఈ సినిమాలో హీరో ధర్మ తన డ్యాన్సులు, ఫైట్స్, యాక్టింగ్ తో అందరినీ మెప్పించాడు . టీజింగ్, ఫన్, ఎమోషనల్ సీన్స్ లో మెచ్యూర్డ్ యాక్టింగ్ చేశాడు . అందుకే ఇప్పుడీ అవార్డు వరించింది.

2 Replies to “‘డ్రింకర్ సాయి’ ధర్మ కి సాక్షి అవార్డు”

Comments are closed.