పంత్ ను కూర్చోబెట్టి రాహుల్ తో విన్యాసాలు!

టీమిండియా క్రికెట్ జ‌ట్టు కోచ్ గౌత‌మ్ గంభీర్ వ్య‌వ‌హారాలు కొన్ని భ‌లే విచిత్రంగా ఉంటాయి! ఒక ర‌కంగా చెప్పాలంటే త‌న వ్యూహాల‌తో ఒక‌ప్పుడు భార‌త జ‌ట్టుకు కోచ్ గా ప‌ని చేసిన గ్రేగ్ చాపెల్…

టీమిండియా క్రికెట్ జ‌ట్టు కోచ్ గౌత‌మ్ గంభీర్ వ్య‌వ‌హారాలు కొన్ని భ‌లే విచిత్రంగా ఉంటాయి! ఒక ర‌కంగా చెప్పాలంటే త‌న వ్యూహాల‌తో ఒక‌ప్పుడు భార‌త జ‌ట్టుకు కోచ్ గా ప‌ని చేసిన గ్రేగ్ చాపెల్ ను గుర్తు తెస్తాడు గంభీర్. జ‌ట్టులో కూర్పునంతా మార్చేసి అప్ప‌ట్లో చాపెల్ అటూ ఇటూ కాకుండా చేశాడు. చివ‌ర‌కు బీసీసీఐ ఆయ‌న‌ను సాగ‌నంపాల్సి వ‌చ్చింది. కొన్నాళ్ల పాటు కోచ్ ఊసే లేకుండా జ‌ట్టు ఆడే ప‌రిస్థితులు వ‌చ్చాయి చాపెల్ పుణ్యాన‌!

గంభీర్ కోచ్ గా బాధ్య‌తలు తీసుకున్నాకా టీమిండియా ట్రాక్ రికార్డు అద్భుతంగా ఏమీ లేదు. గ‌త కొన్ని ద‌శాబ్దాల్లోనే అత్యంత చేదైన ఓట‌ములు గ‌త కొన్నాళ్ల‌లోనే చోటు చేసుకున్నాయి. అనామ‌కంగా క‌నిపిస్తున్న శ్రీలంక చేతిలో కూడా టీమిండియా ఒక సీరిస్ కోల్పోయింది ఆ దేశంలో! అంత‌క‌న్నా దారుణం ఇండియాలో న్యూజిలాండ్ చేతిలో టెస్టు సీరిస్ లో క్లీన్ స్వీప్ కావ‌డం! ఇక ఆస్ట్రేలియాలో వ‌ర‌స‌గా రెండు ప‌ర్యాయాలు బోర్డ‌ర్- గ‌వాస్క‌ర్ ట్రోఫీని దిగ్విజ‌యంగా నెగ్గిన టీమిండియా గ‌త ఏడాది పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న చూపింది. ఒక టెస్టు గెలిచినా, మిగ‌తా టెస్టుల్లో టీమిండియా ప్ర‌ద‌ర్శ‌న అత్యంత పేల‌వంగా సాగింది! క‌నీస పోటీ ఇవ్వ‌లేక‌పోయింది!

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఛాంపియ‌న్స్ ట్రోఫీలో పాక్ పై విజయంతో, కివీస్ పై విజయంతో అభిమానులు అన్నీ మ‌రిచిపోవ‌చ్చు కానీ, జ‌ట్టు కూర్పులో తేడాలొస్తున్నాయి! ప్ర‌త్యేకించి కేఎల్ రాహుల్ కీపింగ్ బాధ్య‌త‌లు అప్ప‌గించి అత‌డి చేత విన్యాసాలు చేయిస్తూ ఉండ‌టం, ఆ పై అత‌డిని మిడిల్ ఆర్డ‌ర్ లో ఆడిస్తూ జ‌ట్టుకు ప్ర‌యోజ‌నం లేక‌పోగా.. అత‌డి కెరీర్ పై కూడా నీలి నీడ‌లు క‌మ్ముకునేలా చేస్తోంది!

ఇంత‌జేసీ పంత్ వంటి ప్ర‌తిభావంత‌మైన ఆట‌గాడిని డ‌గౌట్ లో కూర్చోబెట్టి ఇదంతా జ‌రుగుతూ ఉండ‌టం.. ఒక‌రి కెరీర్ కాదు, ఇద్ద‌రి కెరీర్ ల‌కు ప్ర‌మాద‌క‌రంగా మారింది! కేఎల్ రాహుల్ ఎక్క‌డ చెబితే అక్క‌డ అడొచ్చు.. ఎందుకంటే అవ‌కాశం ముఖ్యం కాబ‌ట్టి. అయితే కేఎల్ వంటి స్ట్రోక్ మేక‌ర్ టెస్టుల్లో మిడిల్ ఆర్డ‌ర్ లో న‌మ్మ‌కంగా క‌నిపించొచ్చు కానీ, ప‌రిమిత ఓవ‌ర్ల‌లో మిడిల్ ఆర్డ‌ర్ లో కేఎల్ ముప్పు తిప్ప‌లు ప‌డుతున్నాడు! అది కూడా అక్ష‌ర్ ప‌టేల్ కూడా ఔట్ అయ్యాకా కేఎల్ రాహుల్ వ‌చ్చి చేయ‌గలుగుతున్న‌ది ఏమీ లేదు! మిడిల్ ఆర్డ‌ర్ క‌న్నా. లోయ‌ర్ ఆర్డ‌ర్ బ్యాటర్ అయ్యాడు రాహుల్! ఓపెన‌ర్ గా వ‌చ్చిన అనుభ‌వం ఉన్న కేఎల్ ఇప్పుడు బ్యాటింగ్ ప‌రంగా చాలా ఇబ్బందులు ప‌డుతూ ఉన్నాడు.

ఇక కీప‌ర్ గా రాహుల్ క‌చ్చితంగా ప్రొఫెష‌న‌ల్ కాదు! అది అత‌డి అద‌న‌పు నైపుణ్యం అంతే! ప్ర‌త్యేకించి కివీస్ తో మ్యాచ్ లో స్పిన్న‌ర్ల బాల్ తిరుగుతున్న వేళ రాహుల్ క‌ష్టాలు చెప్ప‌నల‌వి కావు! కాస్త వైడ్ గా వెళ్లిన బంతిని ప‌ట్ట‌లేక నాలుగు ప‌రుగులు ఇచ్చాడు. బ్యాట్ ను ట‌చ్ అయి వ‌చ్చిన ఒక‌టీ రెండు బంతుల‌ను క్యాచ్ చేయ‌లేక‌పోయాడు. పూర్తిగా క్యాచ్ లు మిస్ చేయ‌క‌పోయినా.. ప్రొఫెష‌నల్ కీప‌ర్ కూ, పార్ట్ టైమ్ కీప‌ర్ కు తేడా ఏమిటో రాహుల్ కీపింగ్ ను చూస్తే అర్థం అవుతుంది!

ఒక‌వైపు రాహుల్ ను ఇంత‌గా ముప్పుతిప్ప‌లు పెట్టి కీపింగ్ చేయాల్సిన అవ‌స‌రం ఎంత అనేది ప్ర‌శ్నార్థ‌కం. గ‌తంలో జట్టుకు నాణ్య‌మైన కీప‌ర్ లేని ద‌శ‌లో ప్యాడ్స్ క‌ట్టుకుని రాహుల్ ద్రావిడ్ తిప్ప‌లు ప‌డేవాడు. దినేష్ కార్తీక్, ధోనీలు వ‌చ్చాకా రాహుల్ మ‌ళ్లీ కీపింగ్ జోలికి వెళ్ల‌లేదు! ఇప్పుడు కేఎల్ రాహుల్ చేత క‌చ్చితంగా కీపింగ్ చేయించాల్సిన‌ట్టుగా లేవు ప‌రిస్థితులు!

ప్ర‌త్యేకించి పంత్ వంటి ఆట‌గాడిని కూర్చోబెట్టి రాహుల్ చేత కీపింగ్ చేయిస్తూ, ఆ పై అత‌డి బ్యాటింగ్ ఆర్డ‌ర్ ను మార్చేసి.. రెండు ర‌కాలుగానూ అత‌డిని అస‌మ‌ర్థుడిగా నిల‌బెట్టే ప్ర‌య‌త్నాల్లాగున్నాయి ఇవ‌న్నీ. తాత్కాలికంగా అత‌డికి అవ‌కాశాలు రావొచ్చు కానీ, మొత్తంగా అయితే కెరీర్ దెబ్బైపోతుంది! ఇక పంత్ వ‌య‌సు, అత‌డి ప్ర‌తిభ‌ను బ‌ట్టి చూస్తే.. ఇప్పుడు అవ‌కాశాలు ఇవ్వ‌క‌పోతే ఇంకెప్పుడు అవ‌కాశాలు ద‌క్కుతాయి! పంత్ వంటి ఆట‌గాడికి ప‌రిమిత ఓవ‌ర్ల మ్యాచ్ ల‌లో అవ‌కాశం ద‌క్క‌క‌పోవ‌డం అన్యాయం కూడా! టీ20ల్లో సంజూసామ్స‌న్ కు అవ‌కాశాలు, వ‌న్డేల్లో ఇలా రాహుల్ తో ప్ర‌యోగాలు, టెస్టుల్లో పంత్ అనుకోవాలా!

మూడు ఫార్మాట్ల‌కూ ముగ్గురు కీప‌ర్లు. వీరుగాక ఇషాన్ కిషాన్ కూడా ఉన్నాడు! ఒక‌ప్పుడు స్పెష‌లిస్ట్ కీపర్ లేక బోలెడు ప్ర‌యోగాలు జ‌రిగాయి, ఇప్పుడు ప్రొఫెష‌న‌ల్ కీపింగ్ స్కిల్స్ తో పాటు, ప్ర‌త్యేక‌మైన బ్యాటింగ్ నైపుణ్యం ఉన్న కీప‌ర్ కూర్చోబెట్టి కీపింగ్ పేరుతో రాహుల్ కెరీర్ తో కూడా గంభీర్ ఆట‌లు కొన‌సాగుతున్న‌ట్టుగా ఉన్నాయి! ఇక ఈ విష‌యాల్లో రోహిత్ జోక్యం చేసుకునే ప‌రిస్థితి కూడా ఉండ‌క‌పోవ‌చ్చు. ప్ర‌స్తుతం జ‌ట్టులో రోహిత్ ప‌రిస్థితే డోలాయ‌మానంగా ఉన్న‌ట్టుంది. బ్యాటింగ్ సంగ‌తి స‌రేస‌రి. ఇలాంటి నేప‌థ్యంలో.. గంభీరే మొత్తం వ్య‌వ‌హారాన్ని శాసిస్తూ ఉన్నాయ‌ని ఈ వ్యూహాలు చాటుతున్నాయి!

6 Replies to “పంత్ ను కూర్చోబెట్టి రాహుల్ తో విన్యాసాలు!”

  1. Cricket gurchi teliyani prathivaadu gambhir gurenchi Rahul keeping gurenchi cheputharu..Rahul good keeper kaabhatte team lo unnadu ..wc lo kuda from last match mundu very good catches carried…Meeku bhaga aadina matches gurchuraavu… batting order depth kosam rahul lower over lo vachunadu…thanu adavalina avasaram ledu just team ki back bone launte chalu..team top 5 batters adithey chalu.

Comments are closed.