చంద్రబాబులో చాలా అనుమానాలున్నాయ్!

వైసీపీ సానుభూతి పరులైన ప్రజలను కూడా వేధించేలా.. వారికి సంక్షేమ పథకాలను నిలిపివేయడం లాంటి దుర్మార్గాలకు ఈ ప్రభుత్వం పాల్పడితే గనుక.. అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.

అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికల సమరంలో పార్టీలుగా విడిపోయి యుద్ధం చేసుకుంటారు.. కానీ ఎన్నికలు పూర్తయి ఏదో ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత.. ఇక ఆ యుద్ధాన్ని మరచిపోవాలి. ప్రజలందరూ ఒకటే యూనిట్ గా భావిస్తూ పరిపాలన సాగించాలి.. ఇది అందరూ ఆదర్శంగా భావించే సిద్ధాంతం. కానీ.. ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. వైరిపక్షానికి ఓటు వేశారని భావించే వారినందరినీ కూడా శత్రువుల్లాగా టార్గెట్ చేయడం అనే సంస్కృతిని ఎలా అర్థం చేసుకోవాలి? పొలిటికల్ గవర్నెన్స్ అనే పదానికి అర్థం ఇదేనా? రాజకీయంగా శత్రుపక్షానికి చెందిన వారిని పూర్తిగా అణిచేయడమేనా.. వారిని వేధించి, భయపెట్టి.. తాము లోబరచుకోవడమేనా? అనే సందేహాలు ఇప్పుడు ప్రజల్లో కలుగుతున్నాయి. చిత్తూరుజిల్లా పర్యటనలో చంద్రబాబునాయుడు కార్యకర్తలతో మాట్లాడిన మాటలను గమనిస్తే ఎవ్వరికైనా ఇలాంటి అభిప్రాయమే కలుగుతుంది.

వైకాపా నాయకులకు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ పనులు చేయవద్దు, వారికి పనులు చేస్తే పాములకు పాలు పోసినట్టే అని చంద్రబాబునాయుడు సెలవిచ్చారు. ఆయన ఈ మాటలను ఏ వేదిక మీద అన్నారు- అనేది గమనించాల్సిన సంగతి. చిత్తూరు జిల్లా పర్యటనలో పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. తమ పార్టీ ప్రజాప్రతినిధులను ఉద్దేశించి.. ఈ ఉపదేశం చేశారు. ఈ మాటలు అనేక సంకేతాలను అందిస్తున్నాయి.

ప్రభుత్వంలో అధికారుల మీద చంద్రబాబునాయుడుకు గానీ, ఆయన సచివులకు గానీ అదుపులేకుండా పోతున్నదని ఇటీవలి కాలంలో అనేక దృష్టాంతాలు నిరూపిస్తున్నాయి. కూటమి సర్కారులోనూ రుషికొండ భవనాల పనులు చేసిన కాంట్రాక్టరుతో సహా, వైసీపీ కాలంలో పనులు చేసిన కాంట్రాక్టర్లు అనేకమందికి బిల్లుల చెల్లింపు జరిగినట్టు వార్తలు వచ్చాయి. నాయకులు ఏమీ చేయలేకపోతున్నారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా కొందరు.. వైసీపీకి చెందిన కాంట్రాక్టర్లు, ఇతరులతో కుమ్మక్కు అయి వారికి పనులు చేసి పెడుతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి.

ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి చెందిన వారు లోపాయికారీగా వైసీపీ వారితో కలిసి అవినీతికి పాల్పడుతూ.. వారికి అడ్డదారుల్లో పనులు చేసిపెడుతున్నారనే ప్రచారాలు పార్టీలోనే ఉన్నాయి. చంద్రబాబునాయుడుకు కూడా తమ పార్టీ నాయకుల మీద అలాంటి అనుమానాలు పుష్కలంగా ఉన్నాయి. పార్టీ ప్రజాప్రతినిధుల సమావేశంలో ఆయన ఈ మాటలు చెప్పడం గమనార్హం. అంటే నాయకుల మీది అనుమానంతోనే.. వారిని వైసీపీ వారికి పనులు చేయవద్దు అంటూ హెచ్చరించినట్టు తెలుస్తోంది.

అయితే ఇలాంటి మాటలు పట్టుకుని.. వైసీపీ సానుభూతి పరులైన ప్రజలను కూడా వేధించేలా.. వారికి సంక్షేమ పథకాలను నిలిపివేయడం లాంటి దుర్మార్గాలకు ఈ ప్రభుత్వం పాల్పడితే గనుక.. అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.

7 Replies to “చంద్రబాబులో చాలా అనుమానాలున్నాయ్!”

  1. అవును ఈసారి బూ!తు!ల బులుగు పార్టీ కి దానికి చీకట్లో సహాయ సహకారాలు అందించిన తెలంగాణ ముక్కోడు పార్టీ కి , బురదలో పుట్టిన ..వ్వు పార్టీ కి గునపం రెడీ గా ఉంది

Comments are closed.