‘ఆయ్’ ఇప్పుడేమంటావ్ బన్నీ వాస్!

ఇదేం చిన్న సినిమా కాదు. ఆయన చెప్పినట్టుగా విడుదలకు ముందే 60 శాతం రికవర్ అవ్వాల్సిన అవసరం లేదు

ఫ్లాప్ సినిమాను 3-4 వారాలకే ఓటీటీకి ఇచ్చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. కాస్త ఎర్లీగా ఇచ్చేస్తే, ఇంకాస్త ఎక్కువ డబ్బులొస్తాయి. అలా కొంతలోకొంత రికవర్ అవ్వొచ్చని ఆశ. కానీ సక్సెస్ అయిన సినిమాను కూడా నెల రోజులకే ఇచ్చేయడం అన్యాయం.

నాగచైతన్య హీరోగా నటించిన తండేల్ సినిమా సక్సెస్ అయింది. చైతూ కెరీర్ లోనే తొలి వంద కోట్ల గ్రాస్ మూవీగా పేరు తెచ్చుకుంది. ఫిబ్రవరి 7న రిలీజైన ఈ సినిమాను మార్చి 7కే స్ట్రీమింగ్ కు పెట్టేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే, రిలీజైన 28 రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తోంది తండేల్.

చిన్న సినిమాలు, ఫ్లాప్ అయిన సినిమాల్ని 2-3 వారాలకే స్ట్రీమింగ్ కు ఇచ్చేస్తున్నారు. కనీసం పెద్ద హీరోలు, పెద్ద బ్యానర్లయినా ఈ విషయంలో నిబంధనలు పాటిస్తే అందరికీ ఆదర్శంగా నిలిచినట్టవుతుంది. కానీ తండేల్ నిర్మాతే కాదు, ఏ పెద్ద నిర్మాత ఇప్పుడీ రూల్స్ పట్టించుకోవడం లేదు.

ఈ అంశంపై గతంలో బన్నీ వాస్ స్పందించాడు. ‘గ్రేట్ ఆంధ్ర’కు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చిన్న సినిమాల్ని 21 రోజులకే ఓటీటీకి ఇవ్వడంలో తప్పులేదని సమర్థించుకున్నాడు. తను తీసిన ఆయ్ సినిమాకు విడుదలకు ముందే 60 శాతం సేవ్ అవ్వాలంటే, 21 రోజులకే ఓటీటీకి ఇచ్చేయాలని అన్నాడు. తనొక్కడ్నే 50 రోజుల లాక్-ఇన్ అనుకుంటే తనకే నష్టమని అన్నాడు.

ఆయ్ సినిమాకు బన్నీ వాస్ చెప్పిన లాజిక్ కరెక్ట్. మరి తండేల్ సినిమాను ఎందుకు నెల రోజులకే ఓటీటీకి ఇచ్చేయాల్సి వచ్చింది. ఇదేం చిన్న సినిమా కాదు. ఆయన చెప్పినట్టుగా విడుదలకు ముందే 60 శాతం రికవర్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు కనీసం ఈ సినిమాకైనా లాక్-ఇన్ రూల్స్ ఫాలో అయితే బాగుండేది కదా.

ఈమధ్య కాలంలో అంతో ఇంతో ఈ లాక్-ఇన్ పీరియడ్ ను ఫాలో అయిన సినిమాలు పుష్ప-2, సంక్రాంతికి వస్తున్నాం మాత్రమే. మిగతా సినిమాలన్నీ అటుఇటుగా నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. నిర్మాతలంతా జనాలకు అలా అలవాటు చేసినప్పుడు బన్నీ వాస్ ఒక్కడు ఏం చేయగలడు పాపం. పైగా తండేల్ కు నాగచైతన్య మార్కెట్ కు మించి బడ్జెట్ పెట్టారు. ఇలా ఎర్లీగా ఓటీటీకి ఇచ్చేయడానికి ఆ అభద్రతా భావం కూడా ఓ కారణం కావొచ్చు.

4 Replies to “‘ఆయ్’ ఇప్పుడేమంటావ్ బన్నీ వాస్!”

  1. ఇంతక ముందు ఫ్రీ గా వస్తే పినఆయిల్ తాగేవారు అనేవాళ్ళు ఇప్పుడు బన్నీ వాసు గాడు ఫ్రీ గా వస్తే పెం!ట తినే రకం

  2. అనేముందు బన్నీ వాసు బాధను పంచుకొని అంటె కొంత నీ పేపర్ కు సానుభూతి వస్తుంది నార్మల్ ఆంధ్ర

Comments are closed.