తను సినిమాలకు దూరమవ్వలేదని ఇదివరకే స్పష్టం చేసింది సమంత. సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకొని, ఓటీటీకే పరిమితమైనట్టు వచ్చిన పుకార్లను ఆమె ఖండించింది. రీసెంట్ గా తన అభిమానులతో చిట్ చాట్ చేసిన సమంత, తిరిగి వస్తున్నాను బ్రో అంటూ క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు మరోసారి తన రీఎంట్రీపై స్పందించింది.
ఆమె సినిమాల్లోకి వచ్చి సరిగ్గా 15 ఏళ్లు అవుతుంది. 2010 ఫిబ్రవరిలో ‘ఏమాయ చేశావె’ సినిమా వచ్చింది. ఆ సినిమా గురించి నేరుగా ప్రస్తావించకుండా, 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కొన్ని ఫొటోలతో పోస్టు పెట్టింది.
ఈ సందర్భంగా తన నుంచి మరిన్ని సినిమాలు వస్తాయంటూ ప్రకటించింది సమంత. విజయ్ దేవరకొండతో చేసిన ఖుషీ తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించలేదు సమంత. పూర్తిగా ఓటీటీ ప్రాజెక్టులకే పరిమితమైంది.
మధ్యలో సొంత నిర్మాణ సంస్థను ప్రకటించి, ఓ సినిమాను కూడా ఎనౌన్స్ చేసినప్పటికీ దానిపై కూడా ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. సినిమాల్లోకి మళ్లీ వస్తానంటూ పదేపదే ఆమె చెబుతుండడంతో, త్వరలోనే సమంత నుంచి సినిమా ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది.
Come on sam garu
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
Welcome back