అడిగో కొత్త సీఎం, ఇడిగో కొత్త సీఎం!

క‌ర్ణాట‌క విష‌యంలో అడిగో కొత్త సీఎం రాబోతున్నాడు, ఇదిగో కొత్త సీఎం ఆయ‌నే.. అనే ప్ర‌చారం నిత్యం సాగే ప‌నిగా మారింది. విశేషం ఏమిటంటే.. బీజేపీ అధికారంలో ఉన్న రోజుల్లోనూ ఇదే క‌థ‌, ఇప్పుడు…

క‌ర్ణాట‌క విష‌యంలో అడిగో కొత్త సీఎం రాబోతున్నాడు, ఇదిగో కొత్త సీఎం ఆయ‌నే.. అనే ప్ర‌చారం నిత్యం సాగే ప‌నిగా మారింది. విశేషం ఏమిటంటే.. బీజేపీ అధికారంలో ఉన్న రోజుల్లోనూ ఇదే క‌థ‌, ఇప్పుడు కాంగ్రెస్ హ‌యాంలోనే అదే క‌థ‌! బీజేపీ హ‌యాంలో య‌డియూర‌ప్ప సీఎంగా ఉన్న‌న్ని రోజులూ.. ఆయ‌న‌ను మార్చ‌బోతున్నారు అనే టాక్ వ‌చ్చేది! దాదాపు రెండేళ్ల‌కు పైనే అప్పుడు య‌డియూర‌ప్ప సీఎంగా చేస్తే.. నిత్యం ఆయ‌న‌ను మార్చ‌బోతున్నారు, అంటూ ఏదో ఒక నెల పేరు వినిపించేది!

అలాంటి వార్త‌ల న‌డుము య‌డియూర‌ప్ప నిత్యం ఢిల్లీ చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేసేవారు! క‌ట్ చేస్తే.. ఆయ‌న‌ను మార్చారు ఒకానొక రోజున‌. ఆయ‌న ఆమోదం ఉంద‌న్న అదే సామాజిక‌వ‌ర్గ నేత‌ను ఒక‌రిని సీఎంగా చేశారు. అయితే ఆయ‌న ఎక్కిన ద‌గ్గ‌ర నుంచి మ‌ళ్లీ అదే పాట‌! అధిష్టానం అభిప్రాయాన్ని మార్చుకుంద‌ని, బొమ్మైని మార్చ‌బోతున్నార‌ని ఆ త‌ర్వాత ఎన్నిక‌లు వ‌చ్చే వ‌ర‌కూ బీజేపీ నేత‌లే ర‌క‌ర‌కాల ప్ర‌చారాలు సాగించారు. అయితే బొమ్మైని బీజేపీ అధిష్టానం మార్చ‌లేదు కానీ, జ‌నాలు మార్చేశారు.

ఇక కాంగ్రెస్ అధికారంలోకి రావ‌డంతోనే.. ముఖ్య‌మంత్రి ఎవ‌రు? అనే ప‌జిల్ న‌డిచింది. చివ‌ర‌కు సిద్ధ‌రామ‌య్య‌కు అవ‌కాశం ద‌క్కింది. డీకే శివ‌కుమార్ కు డిప్యూటీ సీఎం హోదా దక్కింది. అయితే రొటేష‌న్ ఒప్పందం అనే ప్ర‌చారం అప్ప‌ట్లోనే సాగింది. రెండున్న‌రేళ్ల పాటు సిద్ధ‌రామ‌య్య సీఎం అని, ఆ త‌ర్వాత డీకేశికి అవ‌కాశం అనే ప్ర‌చారం సాగింది. అయితే కాంగ్రెస్ హైక‌మాండ్ అలాంటి ఒప్పంద ప్ర‌క‌ట‌న ఏదీ చేయ‌లేదు!

అయితే.. అప్ప‌టి నుంచి సిద్ధును దించేస్తార‌ని, త్వ‌ర‌లోనే డీకేశి ని సీఎంగా చేయ‌బోతున్నారనే ప్ర‌చారాల‌కూ ప‌ని దొరికింది. అప్ప‌ట్లో బీజేపీ ఎమ్మెల్యేలే బ‌య‌ట‌కు వ‌చ్చి ముఖ్య‌మంత్రి మార్పుపై మాట్లాడిన‌ట్టుగా, ఇప్పుడు కాంగ్రెస్ నేత‌లు అదే పాట అందుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్ర‌జాస్వామ్యం ఏ స్థాయిలో ఉంటుందో చెప్ప‌న‌క్క‌ర్లేదు! ఇలాంటి నేప‌థ్యంలో.. కొంద‌రు ఎమ్మెల్యేలు ఇదే ప‌ని పెట్టుకున్నారు.

డిసెంబ‌ర్లో అధిష్టానం సిద్ధును దించి, డీకేశిని సీఎంగా చేస్తుంద‌ని ఒక ఎమ్మెల్యే పాట పాడితే, ఇంకో ఎమ్మెల్యే అలాంటిదేమీ లేదు..ఐదేళ్ల పాటు సిద్ధూనే సీఎం అంటూ ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. ఇలా ఎవ‌రి ప్ర‌క‌ట‌న‌లు వారు చేస్తూ.. తాము ఏ గ్రూపో చాటుకుంటూ ఉన్నారు.

3 Replies to “అడిగో కొత్త సీఎం, ఇడిగో కొత్త సీఎం!”

  1. మా ప్యాలస్ రెడ్డి సిఎం సిఎం అని కలవ రిస్తున్నాడు.

    పాత పార్టీ నే కదా, పిలిచి సిఎం పదవి ఇవ్వండి, బెంగళూర్ విమానం ఖర్చు తగ్గిడ్డి.

Comments are closed.