ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు చంద్రబాబునాయుడు. మరీ ముఖ్యంగా పరిపాలనా అనుభవంలోనూ ఆయనదే రికార్డు. కేవలం సీఎంగా ప్రస్తుతం నడుస్తున్న కాలాన్ని కూడా తీసుకుంటే 15 ఏళ్ల అనుభవం చంద్రబాబు సొంతం. రాజకీయాల్ని కాసేపు పక్కన పెడితే, పార్టీలకు అతీతంగా చంద్రబాబు అందరికీ ఆదర్శంగా నిలిచి వుండాలి. కానీ అందుకు భిన్నమైన పరిస్థితిని చూస్తున్నాం.
ఓహో చంద్రబాబునాయుడి స్థాయి ఇదన్న మాట అని పౌర సమాజం అనుకునే పరిస్థితి. గతంలో 2014-19 మధ్య కాలంలో కూడా చంద్రబాబు వైసీపీ ప్రజాప్రతినిధులున్న నియోజకవర్గాలకు నిధులు కేటాయించలేదు. ఈ విషయాన్ని ఆయనే బహిరంగంగా కర్నూలు జిల్లా పర్యటనలో చెప్పారు. తాజాగా వైసీపీ వాళ్లకు ప్రత్యక్షంగా, లేదా పరోక్షంగా పనులు చేయొద్దని కూటమి ప్రజాప్రతినిధులకు ఆదేశాలు ఇచ్చారు.
తద్వారా తన సంకుచిత మనస్తత్వాన్ని మరోసారి చంద్రబాబు చాటుకున్నట్టైంది. చంద్రబాబు తీరుపై సోషల్ మీడియా దుమ్మెత్తి పోస్తోంది. చంద్రబాబు మాటలు బహుశా టీడీపీ సైకో బ్యాచ్‌కు నచ్చొచ్చు. అలాంటి వాళ్ల కోసం కాదు కదా పరిపాలన! టీడీపీ కార్యకర్తలు, నాయకులకు న్యాయం చేయలేనని చంద్రబాబుకు బాగా తెలుసు. వాళ్లలో అసంతృప్తిని గ్రహించి, ఇలాంటి మాటల ద్వారా సంతృప్తిపరిచే ఎత్తుగడే తప్ప, మరో ఉద్దేశం కనిపించలేదనే చర్చకు తెరలేచింది.
కక్షలు, కార్పణ్యాలు సంతోషాన్ని ఇవ్వవనే సంగతి ప్రతి ఒక్కరికీ తెలుసు. ఒకప్పటిలా రాజకీయంగా విడిపోయి జనాలు కొట్టుకునే పరిస్థితి లేదు. మళ్లీ రాజకీయంగా ప్రజల్ని విడగొట్టి, తాము ఏం చేసినా, చేయకపోయినా పార్టీ కోసం పనిచేసే వ్యూహంలో భాగంగానే చంద్రబాబు వ్యూహాత్మకంగా తన స్థాయిని దిగజార్చుకుని మాట్లాడుతున్నారనే మాట వినిపిస్తోంది. అయితే ఇలాంటి మాటలకు కాలం చెల్లిందని చంద్రబాబు గ్రహించాల్సిన అవసరం వుంది.
ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఇలాంటి వాటికి పొంగిపోయి, ప్రత్యర్థులపైకి రాళ్లు, కర్రలు తీసుకుని పోయి గొడవలు పడే దశను అధిగమించారు. మాకేంటి? అని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. తమకు ప్రయోజనాలు కలగకపోతే, అభిమానంతో అంటకాగే పరిస్థితి లేదు. ఈ వాస్తవాన్ని కూడా చంద్రబాబు గుర్తించాలి. తన మార్క్ పాత రాజకీయాలతో ఇంకా నెట్టుకురావాలని అనుకుంటే సాధ్యమయ్యే పనికాదు.
భయపడకు, దీని మీద ఇది నీ 2 వ ఆర్టికల్. కాలం చెల్లింది లేనిది, ప్రజలు చూసుకుంటారు మళ్ళీ ఎలక్షన్స్ లో. ఇక ఆపు మమ్మల్ని దొబ్బడం
సరే.. అప్డేటెడ్ రాజకీయం అంటే ఏంటో కాస్త సెలవివ్వు..గులకరాళ్లు,గ్రీన్ మ్యాట్ లు,కోడి కత్తులు,జగన్ మామియ్య స్క్రిప్ట్ లు..ఇవేనా??
ఆయన చెప్పింది నాయకులతొ లాలూచిపడి వారి అవినీతి ని కొనసాగనివ్వకండి అన్ని. అందులొ తప్పెముంది!
.
అయినా నిన్నెగా చంద్రబాబు ని చూసి జగన్ నెర్చుకొవాలి అని రాసావ్! మళ్ళి ఇవ్వలా దొశ తెరగెసావ్!
Penta lo kuda suvasana chusenta goppa rationalist vi nuvvu
Next elections ki ballet papers voting aithe correct result vasthundhi
ఏదయినా ఒక ద్వీపాన్ని కొనుక్కుని లేకపోతె ట్రంప్ కన్నా ఎక్కువ మొత్తం ముట్టజెప్పి గ్రీన్లాండ్ ని కొనుక్కుని ఏకం గా 30 ఏళ్ళు అధ్యక్షుడి గా నామినేట్ చేయిన్చుకుంటారో..లేకపోతే బాలట్ మీద ఎలేచ్షన్స్ పెట్టించుకుంటారో తేల్చుకోండి…ఇదే విధమైన మాటలు 2019 లో గెలిచాక ఎందుకు మాటాడలేదు …..
ఎందుకు డైరెక్టుగా నామినేట్ చెయ్యమని నిన్ను అడుగుతారు, చెప్పాయి. ఇంకా కరెక్టుగా ఉంటుంది రేసుల్ట్
Sri Krishna two vastadu e badalau terustadu
Nijame
కాలం ఎవరికీ చెల్లిందో 151 నుండి 11 కి పడిపోయిన కూడా తెలిసిరాలేదు…
Same topic gurinchi already two angels lo nuvvve articles raasav, mally ippudu third angle lo raasaav, inni angles lo annadi cheekutunnav anty, abba nuvvu superahe
కాలము చెల్లని రాజకీయము ఏందో కూడా చెప్పు .. అంటే నీ లెక్కలో బాబాయ్ ని లేపేసి / తల్లి ని చెల్లిని ఇంట్లో నుంచి పంపించేసి / కోడి కత్తి తో పొడిపించుకొని / గులకరాయి తో మింగించుకొనేవి నేటి రాజకీయాలు అంటావు .. కొన్ని రోజులు పోతే 11 తెచ్చుకోవడం కూడా మేటి రాజకీయం అనేటట్లు ఉన్నావు రా .
ఇది సామాన్య ప్రజలకు వర్తించదు. నీ లాంటి కరుడు గట్టిన వై చీపి వారికి మాత్రేమే వర్తిస్తుంది. పాలసీ ప్రకారం ప్రజలకు అండవలసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అందరికి అందుతాయి. వై చీపి కి ఓటు వేసిన వారికి పెన్షన్ అందటం లేదా.ఆధికారం తో పెట్రేగిన బడా వై చీపి నాయకులకు ఇది.