ఆ భ‌యంతో.. సునీల్‌కుమార్‌పై వేటు కాస్త ఆల‌స్యం!

ర‌ఘురామ కోరుకున్న‌ట్టుగా సునీల్‌పై చ‌ర్య‌లు తీసుకున్నా, త‌న కేసుకు సంబంధం లేని వ్య‌వ‌హారంలో కాక‌పోవ‌డంతో డిప్యూటీ స్పీక‌ర్ మ‌న‌సులో అసంతృప్తి వుంటుందేమో!

సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్‌కుమార్‌పై స‌స్పెన్ష‌న్ వేటు ఖాయమై చాలా రోజులైంది. ఒక‌వైపు డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణంరాజు ఇంకా ఎందుకు స‌స్పెండ్ చేయ‌లేదంటూ మీడియాకెక్కి ర‌చ్చ చేయ‌డం తెలిసిందే. కూట‌మి ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌కు లెక్క‌లుంటాయి. ఆ లెక్క‌లో భాగంగానే తాజాగా సునీల్‌కుమార్‌పై స‌స్పెన్ష‌న్ వేటు ప‌డింద‌న్న చ‌ర్చ‌కు తెర‌లేచింది.

ద‌ళితుడైన పీవీ సునీల్‌కుమార్‌పై చ‌ర్య‌లు తీసుకోడానికి నెల‌ల పాటు కూట‌మి ప్ర‌భుత్వం వేచి చూడ‌డానికి ప్ర‌త్యేక కార‌ణం లేక‌పోలేదు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ద‌ళితుల వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌న్న ఏకైక భ‌యంతోనే సునీల్‌పై ఆచితూచి ప్ర‌భుత్వం అడుగులు వేసింది. ఉమ్మ‌డి కృష్ణా-గుంటూరు, అలాగే ఉభ‌య గోదావ‌రి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌లు పూర్త‌యిన వెంట‌నే ఆయ‌నపై చ‌ర్య‌లు తీసుకోవ‌డం గ‌మ‌నార్హం.

పీవీ సునీల్‌కుమార్‌కు ద‌ళితుల్లో మంచి ప‌ట్టు వుంది. ద‌ళిత మిష‌న‌రీకి సంబంధించి సార‌థ్యం కూడా వ‌హిస్తున్న‌ట్టు తెలిసింది. త‌ర‌చూ ద‌ళితుల‌తో స‌మావేశాలు నిర్వ‌హిస్తూ, జాతి పురోగ‌తి కోస‌మ‌ని ప్ర‌సంగాలు ఇస్తుంటారు. ముఖ్యంగా మాల సామాజిక వ‌ర్గంలో ఆయ‌న‌కు బ‌ల‌మైన వ‌ర్గం వుంది. ఈ కార‌ణం రీత్యా ఆయ‌న‌పై వేటు వేయ‌డానికి ప్ర‌భుత్వం కాస్త స‌మ‌యం తీసుకుంది. అది కూడా ర‌ఘురామ క‌స్టోడియ‌ల్ కేసులో ఆయ‌న్ను స‌స్పెండ్ చేయ‌క‌పోవ‌డాన్ని గ‌మ‌నించొచ్చు.

ప్ర‌భుత్వ అనుమ‌తి తీసుకోకుండా విదేశాల‌కు వెళ్లార‌నే ఆరోప‌ణ‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోవ‌డం విశేషం. ర‌ఘురామ ఎపిసోడ్‌లో చ‌ర్య‌లు తీసుకుంటే క్ష‌త్రియుడి కోసం త‌మ సామాజిక వ‌ర్గానికి చెందిన ఉన్న‌తాధికారిపై వేటు వేశార‌నే ఆగ్ర‌హం ద‌ళితుల్లో చూడాల్సి వ‌స్తుంద‌నే భ‌యంతో కూట‌మి స‌ర్కార్ జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. ర‌ఘురామ కోరుకున్న‌ట్టుగా సునీల్‌పై చ‌ర్య‌లు తీసుకున్నా, త‌న కేసుకు సంబంధం లేని వ్య‌వ‌హారంలో కాక‌పోవ‌డంతో డిప్యూటీ స్పీక‌ర్ మ‌న‌సులో అసంతృప్తి వుంటుందేమో!

15 Replies to “ఆ భ‌యంతో.. సునీల్‌కుమార్‌పై వేటు కాస్త ఆల‌స్యం!”

  1. గతం నుండి పాఠాలు నేర్చుకోవాలి!YS జమానాలో ఇలా పెట్రేగి పోయిన అధికారుల జీవితాలు చెల్లాచెదురు అయిన విషయం చూసి కూడా..జగన్ గా..డి వి..ష వలయం లో చిక్కోవడం అంటే ఏమనుకోవాలి?

  2. ఒక పక్క ప్రజలు అంతా ఒక్కడె అంటూ, RRR విషయం లొ చర్య తీసుకుంటె సామాగిక వర్గం, వ్యతిరెకత అంటూ రాయటం ఎమిటి? క్షత్రియుడు ఎమిటి? దళితుడు ఎమిటి? అందరూ ఒక్కటె కదా?

    .

    నీ లెక్క ప్రకారమె చూదాం! మరి 3rd డిగ్రీ ప్రయొగించటానికి ఎ కులం కైనా ప్రత్యెక అదికారాలు ఉన్నాయా? అలా చెసి ఎవరినా కులం చాటున దాక్కుంటె కుదురుతుందా?

  3. మన కులపోడు ఇంకొక కులపోడు ను చట్టవిరుద్ధం గ కొట్టమని ఏ కులం చెప్పదు జగన్ గారు పడేసి గడ్డికి (అక్రమం గ ఆస్తులు పదవి వుపయోగించి సంపాదించుకొనే వెసులుబాటుకు)ఆశపడి తప్పుడు పనులు చేసివస్తే చర్యలు తీసుకోవద్దని ఏ కులం చెప్పదు మీరు sc లను అవమానిస్తున్నారు బలవంతులు అక్రమార్కులు అన్యాయాన్ని ప్రోత్సహిస్తారు కానీ బలహీనులు న్యాయం జరగాలని కోరుకొంటారు అన్యాన్ని సపోర్ట్ చేస్తే రేపు మనకు అన్యాయం జరిగితే ఎవరు సాయం చేయటానికి ముందుకు రారు ఇతన్ని అరెస్ట్ చేసి లోపలేసిన ఎవరు సానుభూతి చూపరు రాష్ట్రప్రజలు అందరు చూసేరు రాజుగారికి ఏమి జరిగిందో

  4. ఈ వాటికన్ మత మార్పిడి ముఠా లు అన్నీ

    అంబేద్కర్ పేరు నీ అద్దం పెట్టుకుని, బుద్ధుడి పేరుని అద్దం పెట్టుకుని , అదే అంబేద్కర్ వ్యతిరేకించి నా క్రైస్తవ మతానికి దశమ భాగాల వసూళ్లు చేసే ఏజెంట్ లుగా వున్నారు.

    దమ్ము వుంటే వెళ్ళని యేసు క్రీస్తు నీ వదిలేసి అంబేద్కర్ పూజించిన బుద్ధుడికి పూజలై చేయమంటే, వెళ్ల వాటికన్ నిజం బయట పడుతుంది.

  5. అం*బేద్కర్ గారి ఆర్డర్ ,

    తన విగ్రహాల తల పైన తాను పూ*జించిన బు*ద్ధుడి కా*షాయ విగ్ర*హం పెట్టీ పూజించాలి అని.

    మన దొంగ వాటి*కన్ గొ*ర్రె బిడ్డ*లకు నోట్లో సి*లువ దిగిడ్డి, అమెం*డ్కర్ చెప్పిన పని చేయాలి ఆంటే.

  6. అం*బేద్కర్ పేరుని వాడుకుంటూ, అం*బేద్కర్ వ్యతిరేకించి న వాటి*కన్ మ*త మా*ర్పిడి చేస్తున్న దశ*మ భా*గాల ఏజెం*ట్ లి వీ*ళ్ళు అందరూ కూడా.

Comments are closed.