150 కోట్ల..’ది పారడైజ్’

నాని లేటెస్ట్ సినిమా ది పారడైజ్. ఈ సినిమా నిర్మాణానికి 150 వరకు ఖర్చు అవుతుందని టాలీవుడ్ లో వినిపిస్తోంది.

నాని లేటెస్ట్ సినిమా ది పారడైజ్. ఈ సినిమా నిర్మాణానికి 150 వరకు ఖర్చు అవుతుందని టాలీవుడ్ లో వినిపిస్తోంది. ఇప్పటి వరకు హీరో నాని సినిమాలు ఏవీ వంద కోట్ల బడ్జెట్ దాట లేదు. దసరా సినిమా 65 కోట్ల నుంచి 70 కోట్ల బడ్జెట్ అయింది. మిగిలిన సినిమాలు అన్నీ దాదాపుగా ఇదే రేంజ్ లో వున్నాయి.

ఫర్ ది ఫస్ట్ టైమ్ 100 కోట్లు దాటబోతోంది నాని సినిమా బడ్జెట్. ఈ సినిమా కోసం ఓల్డ్ సికింద్రాబాద్‌, పారడైజ్ ఏరియా, అక్కడి నివాస ప్రాంతాలు ఇలాంటి సెట్ లు అన్నీ శంషాబాద్ చుట్టుపక్కల రెడీ అవుతున్నారు. దీంతో పాటు చాలా అంటే చాలా సిజి వర్క్ వుంటుంది. నెంబర్ ఆఫ్ డేస్ షూటింగ్ అనేది కూడా ఎక్కువ. కాస్టింగ్ చాలా పెద్దగా వుంటుంది. అనిరుధ్ సంగీతం. జికె విష్ణు సినిమాటోగ్రఫీ ఇలా ప్రతీదీ హై..ఫై నే.

రెమ్యూనిరేషన్లే యాభై నుంచి 60 కోట్లు ఖర్చవుతాయి. మేకింగ్, సిజి వర్క్ లు అన్నీ కలిపి 150 కోట్లు దాటుతుందని అంచనా. ఈ సినిమాకు ఆదాయం కూడా అదే రేంజ్ లో వుండే అవకాశం వుంది. అనిరుధ్ మ్యూజిక్ డైరక్టర్ కావడం వల్ల అడియో రైట్స్ నే పాతిక, ముఫై కోట్ల మేరకు రావచ్చు. ఇక మిగిలిన రైట్స్ కూడా భారీ రేంజ్ లో వుంటాయి.

నాని సినిమాలు అన్నీ చాలా బాగుంటాయి. మంచి ప్రశంసలు అందుకుంటాయి. మంచి రివ్యూలు వస్తాయి. కానీ థియేటర్ దగ్గర అనుకున్న మేరకు మాత్రం డబ్బులు రావడం లేదు అన్న మాట వుంది. సరిపోదా శనివారం సినిమా విషయంలో ఈ మాట కొంత వరకు తొలిగింది. హిట్ 3 సినిమా విషయంలో పక్కాగా థియేటర్ సక్సెస్ వస్తుందనే నమ్మకం వుంది. ది పారడైజ్ కూడా అదే బాటలో వెళ్తుందని ఆశిద్దాం.

6 Replies to “150 కోట్ల..’ది పారడైజ్’”

  1. అంత లేదు 15 కోట్ల కి మించదు, హైప్ create చేసి OTT ల దగ్గర డబ్బు కొట్టేయటానికి ప్రతిఒక్కడు 10 నుంచి 100 రెట్లు పెంచి చెబుతున్నారు ఎధవలు

  2. అంత లేదు 15 కోట్ల కి మించదు, హైప్ create చేసి OTT ల, ఊ!ర మా!స్ దగ్గర డబ్బు కొట్టేయటానికి ప్రతిఒక్కడు 10 నుంచి 100 రెట్లు పెంచి చెబుతున్నారు ఎధవలు

Comments are closed.