డ్రాగన్ తో పారడైజ్ పోటీ?

ఇప్పుడు పారడైజ్ డేట్ కొట్టారు. మరి డ్రాగన్ డేట్ అధికారికంగా ప్రకటించలేదు కనుక ఏం చేస్తుందో చూడాలి.

నాని- చెరుకూరి సుధాకర్- శ్రీకాంత్ ఓదెల సినిమా పారడైజ్. సికింద్రాబాద్‌లోని పారడైజ్ హోటల్ ప్రాంతంలో జమానా కాలం నాడు వుండే జనాల నేపథ్యంలో అల్లుకున్న కథ. ఈ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్, కాన్సెప్ట్, ఎలా వుండబోతోందీ అని వెల్లడిస్తూ ఓ గ్లింప్స్ తయారు చేసి వదిలారు. ఇలా గ్లింప్స్ వదిలి ఊరుకోలేదు. రిలీజ్ డేట్ కూడా వేసేసారు. 26.03.26 విడుదల అంటూ. శ్రీరామనవమి డేట్ అది. ఏడాది ముందుగా డేట్ ఎందుకు వేసారా అని అంతా అనుకున్నారు. ఇప్పుడు అంతా అలా వేయడం కామన్ అయింది కదా అని కూడా అనుకున్నారు.

కానీ దాని వెనుక వేరే వైనం వుందని వినిపిస్తోంది. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ భారీ పాన్ ఇండియా డ్రాగన్ సంగతి తెలిసిందే. అది త్వరలో షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఈ సినిమాను 26 మార్చి 2026 విడుదల చేయాలని యూనిట్, హీరో, డైరక్టర్ ఓ ప్లానింగ్ లో వున్నారని తెలుస్తోంది. మరి ఇది తెలిసి పారడైజ్ డేట్ ముందుగా కొట్టారో, లేక తెలియక కొట్టారో మరి.

పాన్ ఇండియా సినిమాలు డేట్ ముందుగా చెప్పకుండా నార్త్ ఇండియాలో కష్టం. అలాగే తమిళ నాట పెద్ద సినిమాలు రాకుండా చూసుకోవాలి. ఇవన్నీ కాక ఓటిటి వాళ్లతో మాట్లాడుకోవాలి.

అందువల్ల డ్రాగన్ డేట్ విషయంలో ముందుగానే ఓ ఐడియాకు వచ్చి వున్నారు. ఇప్పుడు పారడైజ్ డేట్ కొట్టారు. మరి డ్రాగన్ డేట్ అధికారికంగా ప్రకటించలేదు కనుక ఏం చేస్తుందో చూడాలి.

3 Replies to “డ్రాగన్ తో పారడైజ్ పోటీ?”

Comments are closed.