రష్మికపై మళ్లీ కన్నడ నాట ఆగ్రహం

పాన్ ఇండియా హీరోయిన్ రష్మికపై కన్నడనాట మరోసారి ఆగ్రహం వ్యక్తమైంది. ఈసారి ఏకంగా ఓ ఎమ్మెల్యే ఆమెపై మండిపడ్డాడు.

పాన్ ఇండియా హీరోయిన్ రష్మికపై కన్నడనాట మరోసారి ఆగ్రహం వ్యక్తమైంది. ఈసారి ఏకంగా ఓ ఎమ్మెల్యే ఆమెపై మండిపడ్డాడు. బెంగళూరులో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కు హాజరుకాకపోవడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి, రష్మికపై తీవ్ర ఆరోపణలు చేశారు.

రష్మికకు బుద్ధి చెప్పాల్సిన టైమ్ వచ్చిందంటూ ఆయన బహిరంగంగా మీడియా సమావేశంలోనే విమర్శించడం కలకలం రేపింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కు హాజరు కావాలంటూ రష్మికను పలుమార్లు సంప్రదించారంట. రష్మిక మాత్రం హాజరుకావడానికి ఆసక్తి చూపించలేదంట. ఇది ఆయన ఆగ్రహానికి కారణం.

మొన్నటికిమొన్న బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ తను హైదరాబాద్ నుంచి వచ్చానంటూ చెప్పుకుంది రష్మిక. దీనిపై శాండిల్ వుడ్ లో చాలా దుమారం రేగింది. లైఫ్ ఇచ్చిన కన్నడ చిత్రసీమను పట్టించుకోకుండా, టాలీవుడ్ నుంచి వచ్చానని అనడంపై రష్మికపై రీసెంట్ గా చాలా పెద్ద ట్రోలింగ్ నడిచింది.

ఇప్పుడు దానికి మరింత ఆద్యం పోసేలా ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేశారు. నిజానికి రష్మికకు ఇలాంటి వివాదాలు కొత్తకాదు. కాంతార సినిమా పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ అయిన వేళ, ఆ సినిమా చూడ్డానికి తనకు టైమ్ లేదనే విధంగా స్పందించింది రష్మిక. అంతకంటే ముందు రొమాంటిక్ సాంగ్స్ బాలీవుడ్ లోనే ఎక్కువగా వస్తాయంటూ మరో వివాదాస్పద వ్యాఖ్య చేసింది.

ఇప్పుడీ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కోణంలో మరోసారి రష్మికపై కన్నడ సినీ అభిమానులు ట్రోలింగ్ మొదలుపెట్టారు. రష్మిక పేరు ప్రస్తావించకపోయినా, కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇప్పటికే కన్నడ నటీనటులను పరోక్షంగా హెచ్చరించారు. సినిమా ఇండస్ట్రీ వాళ్లకు నట్టులు, బోల్టులు బిగించాల్సిన అవసరం ఉందన్నారు.

2 Replies to “రష్మికపై మళ్లీ కన్నడ నాట ఆగ్రహం”

Comments are closed.