జీవి ప్రకాష్ కుమార్ వెరీ బిజీ. మ్యూజిక్ డైరెక్షన్ చేస్తాడు. యాక్టింగ్ చేస్తాడు. ఇప్పుడు ‘కింగ్ స్టన్’ సినిమాతో ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేశాడు. ఇన్ని పనులు ఎలా మేనేజ్ చేస్తున్నారంటే ఒక షెడ్యూల్ ప్రకారం అన్ని ప్లాన్ చేసుకుంటానని ఒక పనితో మరొకటి క్లాష్ కాకుండా చూసుకుంటానని చెబుతున్నాడు.
హీరోగా పాతిక సినిమాలు చేసిన ఈ యువ సంగీత దర్శకుడు, 100 సినిమాలకు మ్యూజిక్ అందించాడు. మ్యూజిక్ చేసేటప్పుడు ఆ సినిమాలో తాను నటిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన తన మదిలో ఎప్పుడూ రాలేదంటున్నాడు. తనకు ఆధ్యాత్మిక భావన ఎక్కువ అని, తన పేరు రాసిపెట్టి ఉంటే ఆ సినిమాలు తన దగ్గరకు వస్తాయని, ఇతరుల ప్లేట్ వైపు చూసే మనస్తత్వం తనది కాదని స్పష్టం చేశాడు.
‘కింగ్ స్టన్’ కథ తనను ఎగ్జైట్ చేయడంతో ప్రొడ్యూస్ చేయడానికి ముందు అడుగు వేశానని జీవి ప్రకాష్ తెలిపాడు. ఈ సినిమా గురించి మాట్లాడుతూ, ”ఇండియన్ సినిమాలలో ఇప్పటివరకు ఇటువంటి ఫిలిం రాలేదు. హాలీవుడ్ దర్శక రచయితలు తమ తమ కథలు చెబుతారు. మన అమ్మమ్మలు బామ్మలు చెప్పే కథ తరహాలో కింగ్ స్టన్ ఉంటుంది. టెక్నికల్ పరంగా హాలీవుడ్ స్టాండర్డ్స్ లో ఈ సినిమా ఉంటుంది. అండర్ వాటర్ యాక్షన్ సీన్స్ కోసం నాలుగైదు రోజుల పాటు ట్రైనింగ్ తీసుకున్నా. బోట్ మీద ఫైట్స్ చేసేటప్పుడు కాళ్లకు గాయాలు అయ్యాయి. అయితే ప్రేక్షకులకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం ఈ సినిమా చేశా” అని చెప్పారు. తెలుగులో గంగా ఎంటర్టైన్మెంట్స్ అధినేత మహేశ్వర్ రెడ్డి ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.
సంగీత దర్శకుడిగా తెలుగులో తన తొలి సినిమా ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’, హిందీలో ‘గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్’తో పాటు తాను సంగీతం అందించిన తొలి తమిళ సినిమా కూడా సూపర్ హిట్ అని జీవిత ప్రకాష్ తెలిపాడు. హీరోగా తమిళంలో నటించిన డార్లింగ్ కూడా హిట్ అన్నారు. తనకు ప్రతి దాంట్లో ఫస్ట్ సినిమా సూపర్ హిట్ అందించిందని ఇప్పుడు నిర్మాతగా కింగ్ స్టన్ కూడా సూపర్ హిట్ అందిస్తుందని నమ్మకం తనకు ఉందని చెప్పాడు. బాహుబలి కాంతార సినిమాలు ప్రేక్షకులను ఒక డిఫరెంట్ ప్రపంచంలోకి ఎలా అయితే తీసుకువెళ్లాయో తమ కింగ్ స్టన్ సినిమా కూడా అదే విధంగా తీసుకువెళుతుందని చెప్పుకొచ్చాడు.
అవకాశం వస్తే తెలుగులో యాక్టింగ్ చేయడానికి కూడా రెడీ అని జీవి ప్రకాష్ చెప్పాడు. దసరా సినిమాలో దీక్షిత్ శెట్టి చేసిన క్యారెక్టర్ కోసం తనను అడిగినప్పటికీ రెండు వారాలలో షూటింగ్ కి రావాలని చెప్పడంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఆ సినిమా వదులుకున్నానని స్పష్టం చేశాడు. ప్యారలల్ యూనివర్స్ పిక్చర్స్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన ఈ మ్యూజిక్ డైరెక్టర్ కం హీరో, నిర్మాతగా తాను హీరోగా చేసే సినిమాలు మాత్రమే కాదని ఇతరులతో చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. కింగ్ స్టన్ తర్వాత తమిళంలో సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నానని తెలిపాడు. నితిన్ రాబిన్ హుడ్, అజిత్ గుడ్ బాడ్ అగ్లీ సినిమాలకు జీవీ ప్రకాష్ మ్యూజిక్ చేస్తున్నాడు. విడాకులు తీసుకున్నప్పటికీ మాజీ భార్యతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని తన కుమార్తెతో మాట్లాడుతున్నానని తెలిపాడు.
Good sir
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,