‘పుష్ప-2’తో ఆల్ ఇండియా బిగ్గెస్ట్ హిట్ అందుకున్న అల్లు అర్జున్, తర్వాత ఏం చేయబోతున్నాడు? చేతిలో త్రివిక్రమ్, అట్లీ సినిమాలు రెడీగా ఉన్నాయి.
అయితే వీటిలో బన్నీ ఏ సినిమాను ముందుగా సెట్స్ పైకి తీసుకొస్తాడనేది ప్రస్తుతం మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. ఈ 2 రోజుల్లో దీనిపై క్లారిటీ వస్తుందని అంతా భావించారు. కానీ అలాంటిదేం లేదని బన్నీ వాస్ క్లారిటీ ఇచ్చేశాడు.
కొన్ని రోజులు విదేశీ పర్యటనకు వెళ్లాడు అల్లు అర్జున్. ఇదేదో సేదతీరడానికి కాదు. ఆయన తన పర్సనల్ ట్రయినింగ్ కోసం వెళ్లాడంట. నటనకు సంబంధించి బన్నీ ఎప్పుడూ ఏదో ఒకటి రీసెర్చ్ చేస్తూనే ఉంటాడని, అందులో భాగంగానే ట్రయినింగ్ కు వెళ్లాడని చెప్పుకొచ్చాడు బన్నీ వాస్.
ఈరోజు బన్నీ తిరిగొచ్చాడు. దీంతో అతడి నెక్ట్స్ సినిమా ప్రకటన వస్తుందని అంతా ఎదురుచూశారు. అయితే ఇప్పట్లో ప్రకటన రావడం కొంచెం కష్టమనే విధంగా స్పందించాడు బన్నీ వాసు. అల్లు అర్జున్ సినిమాలకు సంబంధించి తొందర్లోనే ఆయా టీమ్స్ ప్రకటనలు చేస్తాయని మాత్రమే అన్నాడు.
Maku vodhu
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,