టీడీపీ జనసేనకు షాకిచ్చిన ఫలితం

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ జనసేనలకు షాక్ ఇస్తూ ఫలితం వెలువడింది.

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ జనసేనలకు షాక్ ఇస్తూ ఫలితం వెలువడింది. పీఆర్టీయూ మద్దతుతో పోటీలో నిలిచిన గాదె శ్రీనివాసులునాయుడుని ఉపాధ్యాయులు గెలిపించారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ టీడీపీ జనసేనలు కలసి బలపరచిన పాకలపాటి రఘువర్మ ఓటమి పాలు అయ్యారు. గాదెకు బీజేపీ మద్దతు ప్రకటించడం గమనార్హం.

ఉత్తరాంధ్రలోని మొత్తం 22 వేల పైచిలుకు ఉపాధ్యాయులు ఇచ్చిన ఈ ఫలితం మీద అంతా తర్కించుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో రఘువర్మతో పాటుగా పీడీఎఫ్ అభ్యర్థిని యూటీఎఫ్ సమర్ధించిన విజయగౌరికి బాగానే ఓట్లు పడ్డాయి. మొదటి ప్రాధాన్యత ఓట్లలో గాదెకు 7216 ఓట్లు రాగా రఘువర్మకు 6,851 ఓట్లు వచ్చాయి. విజయగౌరికి 5811 ఓట్లు లభించాయి.

దాంతో తొలి ప్రాధాన్యత ఓట్లతో గాదె విజయం సాధించలేకపోయారు.మ్యాజిక్ ఫిగర్ 10,068 ఓట్లు ఎవరికీ రాకపోవటంతో ఎన్నికల అధికారులు రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కించారు. దాంతో శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. అయితే ఆయనకు ఎక్కువగా ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు పీడీఎఫ్ అభ్యర్థిని విజయగౌరి నుంచే వచ్చాయి.

ఆమెకు పోలైన ఓట్లలో ఎక్కువ శాతం మంది ద్వితీయ ప్రాధాన్యం ఓట్లు శ్రీనివాసులు నాయుడుకు వేసినట్లు తెలుస్తోంది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘువర్మ ఓటమికి ఇదే కారణంగా మారింది అని అంటున్నారు. పీడీఎఫ్ ఈ విధంగా తాను గెలవకపోయినా మంచి ఓట్లు తెచ్చుకోవడమే కాకుండా గాదె శ్రీనివాసులునాయుడు గెలుపునకు పరోక్ష కారణమైంది.

గాదె 2007 నుంచి 13 వరకూ ఆరేళ్ళ పాటు తొలిసారి ఎమ్మెల్సీగా చేశారు. ఆ తరువాత 2013 నుంచి 2019 వరకూ మరోసారి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీగా కొనసాగారు. ఈ దఫా విజయంతో ఆయన 18 ఏళ్ళ పాటు ఎమ్మెల్సీగా ఉంటారన్న మాట. అలాగే మూడు సార్లు గెలిచిన నాయకుడిగా ఆయన కొత్త రికార్డు సాధించారు.

టీడీపీ జనసేన మద్దతుతో బరిలోకి నిలిచిన రఘువర్మకు షాకింగ్ ఫలితం రావడంతో టీచర్లు కూటమి ప్రభుత్వం పట్ల తమ వైఖరిని ఈ విధంగా చాటారా అని చర్చ సాగుతోంది. రఘువర్మ కంటే తొలి ప్రాధాన్యత ఓట్లు శ్రీనివాసులు నాయుడుకు, విజయగౌరికి రావడం, ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు కూడా వారికే ఎక్కువగా రావడంతో కూటమికి ఈ ఫలితం ఇబ్బందికరమే అని అంటున్నారు.

45 Replies to “టీడీపీ జనసేనకు షాకిచ్చిన ఫలితం”

  1. జగన్ MLC లు 4 years tharvatha odaru.

    ఇప్పుడు కూటమి 9 nelalake odindi.అందులోనూ educates electoral లో…ఆలోచించవలసిన విషయమే..

      1. Vallu odipayaru sare. Kaani alternative gaa malli kootami candidate ne elect chesikunnaaru kadaa. Mana party ni kaneesam alternative gaa kudaa chudatam ledu. Idi kootami ki alert or Mana party ki death bells?

    1. ఏడ్చినట్టే ఉంది నీ పనికిమాలిన లాజిక్..

      వైసీపీ ప్రభుత్వం లో ఉన్నప్పుడు 9 నెలలకు గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు పెట్టలేదు.. డిలే చేసి చేసి మూడేళ్ళ తర్వాత పెట్టారు..

      అదే 9 నెలలకే పెట్టి ఉంటె.. నీ జగన్ రెడ్డి కనీసం మేలుకొని ఉండేవాడు.. వ్యతిరేకత ని కొద్దిగా అయినా సరిదిద్దుకొనేవాడు..

      ..

      ప్రతీది జగన్ రెడ్డి భజన కు వాడుకొన్నారు కాబట్టే.. ఈ రోజు కనీసం కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత ని వాడుకోలేకపోయారు..

      1. అసలు ఓట్లు వేసే వారిని భయపెట్టి ఓట్లు వేయించుకున్నారు అధికారం లో ఉన్నప్పుడు

        1. ఎక్కడలేని నీతి సూక్తులు ఇప్పుడే వచ్చేస్తాయి..

          గత ఐదేళ్లు .. జగనన్న తోపు.. దమ్ముంటే ఆపు అని భజన చేసి..

          ఇప్పుడు వేలల్లో ఉండే టీచర్స్ ఎన్నిక ఓడిపోతే.. మీకు ఎక్కడాలేని ప్రవచనాలు గుర్తొస్తున్నాయి..

          మరి గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో లక్షల ఓట్లు ఉంటాయి.. అందులో కూటమి భారీ మెజారిటీ తో గెలుస్తోంది ..

          నీ సూక్తులు పని చేయవు.. లైట్ తీసుకో..

      2. బొల్లి సుల్లి గానే నమ్మిన వాలు, తుగ్లక్ ని ఎందుకు నమ్మరు రా శెక్క లన్ జే గో డు కా

  2. అంతే కూటమి కూలిపోతుంది ..అన్న ముఖ్య మంత్రి అయిపోతారు…నెక్స్ట్ అదే కదా???!!!

  3. ఇక్కడ BJP ఒకరిని సమర్దించింది, చివరి నిమషంలొ TDP మరొకరిని సమర్దించింది. ఇక BJP సమర్దించిన అబ్యర్ది మొదటి స్తానంలొ వస్తె, TDP సమర్దించిన అభ్యర్ధి 2 వ స్తానమలొ వచ్చాడు. నువ్వు సామర్దించిన వాళ్ళు మూడవ స్తానంలొ కదా వచ్చింది

    .

    మరి దీన్ని బట్టి ఇక్కడ కూటమి బలంగా ఉనట్టా, కాదా?

      1. If you want to find negative for kootam in everything, it’s up to you. If we go by your logic, should we consider the thumping majorities in Graduate MLC as full support for the govt and aikamatyam in kootami?

  4. Techers inka prbhuthva ఉద్యోగులు. D A lu ఆశించారు కానీ కూటమి అవి ఇవ లేదు ఆ కోపాన్ని ఇలా ప్రదర్శించారు . ఇక ఆలపాటి రాజా గ్రాడ్యూట్ ఎన్నికల్లో భారీ మెజారిటీ లో ఉన్నారు అది కూటమి మీ మంచి వార్తే కథ ఇది రాసి అది రాయలేదెం

  5. అవును ..షాక్ వచ్చి పడిపోయా..ఫ్రెండ్స్ వెంటనే జగన్ మామియా అని అరవటం మొదలెట్టారు.. వెంటనే..తేరుకున్న…:):)

  6. వాళ్ళ ఓటర్లు వేరే – సజ్జల్

    సిట్టింగ్ MLC పై వ్యతిరేకత

    కూటమి పార్టీల మద్దతు చీలిపోవడం

    టీచర్స్ కోరే గోంతెమ్మ కోర్కెలు తీర్చలేదనే కోపం తో, బ్లాక్మెయిల్ చెయ్యడానికి USE చేసుకున్నారు

    ఏదేమైనా మా ఓటర్లు వేరే అనలేం..

  7. మా సింగల్ సింహం (తోకలేని ) ఇక జూలు విధుల్చుకుని ప్యాలెస్ నుండి రేపు బైటకి వచ్చి, పవన్ బట్టలుడదీస్తుంది.

    రేపటినుండి అసెంబ్లీ కి వస్తుంది.. ఇక ప్రతిపెచ్చ హోదా కోసం No అడుక్కోవడాల్.. డైరెక్ట్ సీఎం సీటే ఇక

    టీచర్స్MLC ఓడిపోయన చంద్రబాబు వెంటనే రాజీనామా చెయ్యాలని నిరాహారదీక్ష చేసి, ఎలక్షన్స్ డిమాండ్ పెట్టి డైరెక్ట్ సీఎం ఔపోవడమే ఇక..

      1. Mana party kaneesam poti kudaa cheyyaledu kadaa mitramaa…bahusaa manam poti chesi vunte, mana palana gurtuku vachi andaru kootami candidate ke vese vaaru emo. Ainaa, manam 3 MLC vodinaddupudu adi mana palana failure ki edo oka step ani voppukunnaavaa?

      1. Less than 1 year, started incumbency. Doctor cautioned pre-diabetes, ignore or take precautionary steps, its in your hands.

        But if you want to compare with bed ridden death patient, you will also die like them

  8. భగీరధ సినిమాలో శ్రేయ ఒక కధ రూపంలో హీరో ని insprire చేస్తుంది. ఈ ఆర్టికల్స్ చూస్తే ఆ సీన్ గుర్తు వచ్చింది. మీరసలు పోటీ చెయ్యలేదు కదా? పోటీ చేసి ఒక స్థానం లో వోడి పోయిన కూటమి మీద ఇన్ని ఆర్టికల్స్ రాసినప్పుడు, అసలు పోటీ చెయ్యకుండా ఓడి పోయిన వాళ్ళ గురించి కూడా రాయాలి కదా?

  9. Vijaya gouri leading… YCP support undi annav… oho… last nundi first aa??

    Enthaina… intha vyathirekatha unnapudu.. mana anna enduku poti cheyaledu…?

    Participents lera? Dabbu leda??

    Leka janalu chee antarana?

  10. ఇక్కడ జగన్ గారు పోటీచేసి ఉంటే కూటమి కి బాగుండేది అసలు పబ్లిసిటీ కూడా చెయ్యక్కర్లేకుండా బంపర్ మెజారిటీ తో గెలిచేది paytm వాళ్లకు తప్ప ఎవరు కు జగన్ గారిని రానివ్వటానికి ఇష్టపడటం లేదు

  11. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసలు పోటీకి కూడా దిగకుండా భయపడి పారిపోయిన వైసీపీ, ఇప్పుడు ఫేక్ ప్రచారం చేస్తోంది. శ్రీనివాసులు, రఘువర్మకు ప్రథమ, ద్వితీయ ఓటు వేయాలని మా కూటమి పిలుపిచ్చింది. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో UTF ముసుగులో వైసీపీ పోటీ పెట్టింది.

Comments are closed.