బైక్ ఇస్తానన్నాడు.. కథ చెప్పేశాడు

దిల్ రుబా.. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన సినిమా. ఇందులో కస్టమైజ్ చేసిన ఓ బైక్ వాడాడు అబ్బవరం. ఆ బైక్ తో మొన్ననే ఓ వీడియో కూడా రిలీజ్ చేశాడు. Advertisement తమ…

దిల్ రుబా.. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన సినిమా. ఇందులో కస్టమైజ్ చేసిన ఓ బైక్ వాడాడు అబ్బవరం. ఆ బైక్ తో మొన్ననే ఓ వీడియో కూడా రిలీజ్ చేశాడు.

తమ సినిమా ప్లాట్ గెస్ చేసినవాళ్లకు ఆ బైక్ ను బహుమతిగా ఇచ్చేస్తానన్నాడు. ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో వేదికపై బైక్ ను అందిస్తానంటూ ఘనంగా పోటీని ప్రకటించాడు.

కట్ చేస్తే, ఇప్పుడు తనే స్వయంగా దిల్ రుబా స్టోరీలైన్ ను బయటపెట్టేశాడు కిరణ్ అబ్బవరం. ‘గ్రేట్ ఆంధ్ర’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దిల్ రుబా జానర్ ఏంటి.. హీరో క్యారెక్టరైజేషన్ ఏంటి.. స్టోరీ లైన్ ఏంటనేది గబగబా చెప్పేశాడు.

దిల్ రుబా సినిమాలో హీరో ఎవ్వరికీ సారీ, థ్యాంక్స్ లాంటివి చెప్పడు. అది చిన్న విషయం అనిపించినప్పటికీ, అలా ఉండడం చాలా కష్టం. అదే అతడికి ఇబ్బంది కూడా తెచ్చిపెడుతుంది.

ఇది హీరో క్యారెక్టరైజేషన్. ఇక కథ విషయానికొస్తే.. అలాంటి డిఫరెంట్ క్యారెక్టర్ తో ఉన్న హీరోకి ఆల్రెడీ హీరోయిన్ తో బ్రేకప్ అయిపోతుంది. ఆ తర్వాత మరో హీరోయిన్ కు కనెక్ట్ అవుతాడు. అది కూడా బ్రేకప్ స్టేజ్ కు వెళ్లే దశలో మాజీ ప్రేయసి సీన్ లోకి వచ్చి, హీరో ప్రజెంట్ లవ్ స్టోరీని ఎలా సెట్ చేసిందనేది దిల్ రుబా స్టోరీ.

ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఇదే విషయాన్ని త్వరలోనే రిలీజ్ చేయబోతున్న ట్రయిలర్ లో కూడా చెబుతున్నారట. ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత ఇంకా ప్లాట్ ను గెస్ చేయమంటూ పోటీ ఎందుకు పెడుతున్నాడో అర్థం కావడం లేదు. ఇంతకంటే గెస్ చేయడానికి ఇంకేం ఉంది.

2 Replies to “బైక్ ఇస్తానన్నాడు.. కథ చెప్పేశాడు”

Comments are closed.