ఎన్టీఆర్-నీల్ సినిమా టైటిల్ ఇదే!

ఎన్టీఆర్ తో చేయబోయే డ్రాగన్ సినిమా హై-ఓల్టేజ్ యాక్షన్ మూవీ. ఈ డ్రాగన్ కు ఆ డ్రాగన్ కు చాలా డిఫరెన్స్ ఉంది.

కొన్నిసార్లు ఏదో మాట్లాడాలనుకొని, ఇంకేదో బయటపెట్టేస్తుంటారు చాలామంది. నిర్మాత రవిశంకర్ కూడా అదే పనిచేశారు. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పెట్టిన విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పేశారు.

రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా వంద కోట్లు చేసింది. మరి ఎన్టీఆర్-నీల్ సినిమాకు తమిళనాట డిఫరెంట్ టైటిల్ ఏమైనా పెడతారా? అనేది ప్రశ్న. దీనికి సమాధానమిచ్చే క్రమంలో ఎన్టీఆర్-నీల్ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పెట్టిన విషయాన్ని పరోక్షంగా వెల్లడించాడు రవిశంకర్.

“ఎన్టీఆర్ తో చేయబోయే డ్రాగన్ సినిమా హై-ఓల్టేజ్ యాక్షన్ మూవీ. ఈ డ్రాగన్ కు ఆ డ్రాగన్ కు చాలా డిఫరెన్స్ ఉంది. ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ ఇంటర్నేషనల్ సినిమా. ఈ డ్రాగన్ హిట్టవ్వడం ఇంకా హ్యాపీగా ఉంది. నెక్ట్స్ మా పెద్ద డ్రాగన్ వచ్చి మొత్తాన్ని చుట్టేస్తుంది.”

ఇలా ఎక్సయిట్ మెంట్ లో ఎన్టీఆర్-నీల్ సినిమాకు డ్రాగన్ అనే పేరుపెట్టిన విషయాన్ని బయటపెట్టేశారు రవిశంకర్. నిజానికి ఈ టైటిల్ ఇదేనని అంతా ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు. మేకర్స్ మాత్రం కమిట్ అవ్వలేదు. ఇప్పుడు రవిశంకర్ బయటపెట్టేశాడు.

ఎన్టీఆర్ తో చేస్తున్న డ్రాగన్ సినిమా కథను ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ పై ఎవ్వరూ చూడలేదంటున్న ఈ నిర్మాత.. అందరి అంచనాలకు అందనంతగా ఆ సినిమా పెద్ద విజయం సాధిస్తుందని అంటున్నాడు.

2 Replies to “ఎన్టీఆర్-నీల్ సినిమా టైటిల్ ఇదే!”

Comments are closed.