సమంతాను తాకిన ఏఐ దెబ్బ

సమంత వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య మాస్టర్ తో సమంత రిహార్సల్స్ చేస్తున్న వీడియో అది.

ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ దుర్వినియోగం వల్ల చాలామంది హీరోయిన్లు ఇబ్బంది పడ్డారు. రష్మిక. అలియా భట్, జాన్వి కపూర్, మృణాల్, దీపిక పదుకోన్, తాజాగా కంగనా రనౌత్… ఇలా చెప్పుకుంటూపోతే ఈ లిస్ట్ చాంతాడంత అవుతుంది. ఇప్పుడీ జాబితాలోకి సమంత కూడా చేరిపోయింది.

సమంత వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య మాస్టర్ తో సమంత రిహార్సల్స్ చేస్తున్న వీడియో అది. అందులో గణేశ్ మాస్టర్ కాస్త గట్టిగానే ఆమెను పట్టుకున్నాడు. ఒళ్లంతా తడిమాడు, ఓ ముద్దు కూడా పెట్టాడు.

అదంతా రిహార్సల్ లో భాగమే అయినప్పటికీ వీడియో బాగా వైరల్ అయింది. బహుశా, ‘పుష్ప’ సినిమా టైమ్ లో జరిగి ఉండొచ్చని చాలామంది ఓ అభిప్రాయానికి కూడా వచ్చేశారు. అయితే నిజానికి అందులో ఉన్నది సమంత కాదు.

గణేశ్ ఆచార్య మాస్టర్, హీరోయిన్ డైజీ షా కలిసి రిహార్సల్స్ చేస్తున్న క్లిప్ అది. దాన్ని ఏఐ ఉపయోగించి, ఒరిజినల్ హీరోయిన్ స్థానంలో సమంతను పెట్టారు. చూడ్డానికి అచ్చం ఒరిజినల్ వీడియోలా అనిపించినప్పటికీ నిజానికి ఇదొక ఫేక్ వీడియో.

ఇలాంటివి తయారుచేయడం ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. అయితే సరదా కోసం యువత చేస్తున్న ఇలాంటి పనులు వాళ్లను ఇబ్బందుల్లోకి నెట్టడం ఖాయం. ఈ విషయంలో చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి

4 Replies to “సమంతాను తాకిన ఏఐ దెబ్బ”

Comments are closed.