హీరోయిన్ గా అవకాశాలు తగ్గుముఖం పట్టిన దశలో .. వెబ్ సీరిస్ ల అవకాశాలను ఒడిసిపట్టేసుకుంటూ, బోల్డ్ గా నటిస్తూ దూసుకుపోతున్న తమన్నా అదే సమయంలో తన లవ్ స్టోరీని వెల్లడించింది. నటుడు విజయ్ వర్మతో తమన్నా ప్రేమాయణం సాగిస్తున్న వైనాన్ని తనే ప్రచారం చేసుకుంది. దాదాపు రెండేళ్ల నుంచి వీరి ప్రేమాయణం సాగుతోందట. కొంతకాలం పాటు దాన్ని హైడ్ చేసి, చివరకు ప్రచారం కల్పించారు! తాము తమ లవ్ స్టోరీని కావాలని దాచలేదని, అదలా జరిగిపోయిందని.. ఈ జంట కొన్నాళ్ల కిందట ప్రకటించింది.
ఆ సంగతలా ఉంటే.. వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారనే ప్రచారం జరుగుతూ ఉందిప్పుడు! వీరిద్దరూ పరస్పర అంగీకారంతో బ్రేకప్ చెప్పుకున్నారని, ఇకపై ఫ్రెండ్స్ గానే కొనసాగాలని, రొమాంటిక్ రిలేషన్ షిప్ కు వీరు బ్రేకప్ చెప్పుకున్నారట! ఇద్దరికీ ఒకరంటే ఒకరికి గౌరవం ఉందని, అభిమానాలు ఉంటాయని.. రొమాంటిక్ రిలేషన్ షిప్ మాత్రం ఉండదట!
ఈ మేరకు వీరు విడిపోయారని.. తమ ప్రేమకథకు రెండేళ్ల వ్యవధికే బ్రేకప్ ఇచ్చుకున్నారని ప్రచారం నడుస్తూ ఉంది. విజయ్ వర్మతో తన ప్రేమకథను అపురూపంగా చెప్పింది తమన్నా! అతడిని అనేక రకాలుగా ప్రశంసించింది. మగవులతో ఎలా నడుచుకోవాలో తెలిసిన మగవాడని అతడికి కితాబులిచ్చింది. అంతేగాక ఒక వెబ్ సీరిస్ లో రెచ్చిపోయి నటించడం పట్ల స్పందిస్తూ.. తను బోల్డ్ గా నటించింది తన ప్రియుడితోనే కాబట్టి.. నో ప్రాబ్లమ్ అన్నట్టుగా తమన్నా స్పందించింది అప్పట్లో!
అయితే.. ఇప్పుడు బ్రేకప్ కథనాలు ఆసక్తిని రేపుతూ ఉన్నాయి. హీరోయిన్ ఆ బిజీగా ఉన్న దశలో తమన్నా పెద్ద లవ్ స్టోరీలను పైకేతే నడపలేదు! హీరోలతోనో, ప్రముఖులతోనే లవ్ ఎఫైర్ అనే పుకార్లకు ఊతం ఇవ్వలేదు! తన పర్సనల్ లైఫ్ ను పూర్తి రహస్యంగానే ఉంచింది. విజయ్ వర్మతో కూడా కొంతకాలం తర్వాతే వ్యవహారానికి ప్రచారాన్ని ఇచ్చింది. మరి ఇన్నాళ్లూ లవ్ రహస్యంగా తన లవ్ లైఫ్ ను పెట్టుకున్న తమన్నా ఒక ప్రేమకథకు ప్రచారాన్ని ఇచ్చిన కొంతకాలానికే బ్రేకప్ వార్తల్లో నిలుస్తూ ఉండటం గమనార్హం.
ఏమిరా వెంకటప్పా, ఈ న్యూస్ వల్ల దేశానికి ఉపయోగం?
ప్రపంచమంతా సెలబ్రిటీలు, సినిమా వాళ్ళ వ్యవహారం మీద జనాలకు ఆసక్తి ఎక్కువ. అదే మీడియా వారికి పంట.
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
Ayo
Generally one side use and throw. here reverse. anthe teda.