స్మగ్లింగ్ చేస్తూ హీరోయిన్ ఎలా పట్టుబడింది?

15 రోజుల్లో 4 సార్లు దుబాయ్ వెళ్లొస్తున్న రాన్యా రావుపై డైరక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ – డీఆర్ఐ అధికారులకు అనుమానం వచ్చింది.

విమానం ద్వారా స్మగ్లింగ్ చేయడం ఇప్పుడు చాలా కష్టం. ఎన్నో రకాలుగా ప్రయత్నించి కస్టమ్స్ కు దొరికినపోయిన వాళ్లు చాలామంది ఉన్నారు. ప్యాంట్లు, అండర్ వేర్, షూ కింద.. ఇలా రకరకాలుగా బంగారం దాచినప్పటికీ అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి కస్టమ్స్ అధికారులు ఇట్టే పట్టేస్తున్నారు. మరి హీరోయిన్ రాన్యా రావు ఇన్నాళ్లూ ఎలా తప్పించుకుంది?

సెలబ్రిటీలకైనా ఎయిర్ పోర్టులో చెకింగ్స్ కామన్. కానీ రాన్యా రావు మాత్రం మరింత హై-ప్రొఫైల్ మెయింటైన్ చేసింది. ఎలా అంటే, ఆమె విమానం దిగడమే ఆలస్యం, పోలీసులు ఆమెను చుట్టుముట్టేవారు. హై-ప్రొఫైల్ సెలబ్రిటీ పేరిట ఆమెను నేరుగా కారు ఎక్కించేవారు. దీంతో పలు సందర్భాల్లో తనిఖీ లేకుండానే ఆమె ఎంచక్కా ఇంటికెళ్లిపోయేది.

ఎవ్వరికీ సాధ్యం కానిది రాన్యా రావుకు ఎలా సాధ్యమైంది? ఎలా అంటే ఆమె స్వయానా డీజీపీ కూతురు కాబట్టి. డీజీపీ రెండో భార్య కుమార్తె ఈమె. దీంతో రాన్యా విమానం దిగిన ప్రతిసారి సెక్యూరిటీ కారణాలు చెప్పి నేరుగా కారు ఎక్కించేవారు పోలీసులు. పైగా హీరోయిన్ కాబట్టి ఎవ్వరూ పెద్దగా అనుమానించలేదు కూడా.

కానీ 15 రోజుల్లో 4 సార్లు దుబాయ్ వెళ్లొస్తున్న రాన్యా రావుపై డైరక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ – డీఆర్ఐ అధికారులకు అనుమానం వచ్చింది. గట్టిగా నిఘా పెట్టారు. ఎప్పట్లానే రాన్యా విమానం దిగింది. పోలీసులు ఆమెను కారు ఎక్కించేందుకు రెడీ అయ్యారు. డీఆర్ఐ అధికారులు మాత్రం వదల్లేదు. పోలీసులు అభ్యంతరం చెప్పినప్పటికీ తమ డ్యూటీ తాము చేశారు. ఇంకేముందు ఏకంగా 15 కిలోల బంగారంతో అడ్డంగా దొరికిపోయింది హీరోయిన్ రాన్యారావు.

6 Replies to “స్మగ్లింగ్ చేస్తూ హీరోయిన్ ఎలా పట్టుబడింది?”

Comments are closed.