మైనారిటీ కోటాలో ఎమ్మెల్సీ సీటు

విశాఖ నుంచి ఖాళీ అయిన ఎమ్మెల్సీ సీటును ఇక్కడ నుంచే భర్తీ చేస్తూ మైనారిటీ సోదరులకు ఈసారి ఆ ఆనందం పంచాలని కోరుతున్నారు.

ఎమ్మెల్సీ పదవి కోసం తమ్ముళ్లు పోటీ పడుతున్నారు. పెద్దల సభకు ఒక్కసారి నెగ్గితే ఆరేళ్ల పాటు అక్కడ కొనసాగవచ్చు. చట్ట సభలలో సభ్యుడిగా గౌరవంతో పాటు అధికార వైభోగం దక్కుతుంది. దాంతో ఎమ్మెల్సీ రేసులో చాలా మంది పోటీ పడుతున్నారు.

గతంలో అనూహ్యంగా దువ్వాడ రామారావుకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. ఆయనను ఒక మాజీ మంత్రి సిఫార్సు చేసి ఎమ్మెల్సీగా పెద్దల సభకు పంపించారని చెబుతారు. ఆరేళ్ల పాటు ఆ పదవిలో ఉన్న రామారావు మరోసారి ఆ పోస్టు రీన్యువల్ కోరుకుంటున్నారు. ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు. విశాఖ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

అయితే ముస్లిం మైనారిటీలకు గడచిన ఎన్నికల్లో ఉత్తరాంధ్ర నుంచి సీటు ఇవ్వలేదని, వారి జనాభా విశాఖలో ఎక్కువగా ఉందని కాబట్టి మైనారిటీ కోటాలో ఎమ్మెల్సీ సీటు భర్తీ చేయాలని ఆ వర్గం నేతలు కోరుతున్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన తనకు గుర్తింపు ఇవ్వాలని వారు అభిప్రాయపడుతున్నారు.

గతంలో మూడు దశాబ్దాల క్రితం ముస్లిం మైనారిటీ వర్గం నుంచి ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున ఒకరు ఉండేవారు. ఆ తరువాత చాన్స్ మళ్లీ ఎవరికీ దక్కలేదని వారు అంటున్నారు. విశాఖలోని మూడు నాలుగు నియోజకవర్గాలలో ఉన్న ముస్లిం సోదరులు కూటమి గెలుపునకు కృషి చేశారని చెబుతున్నారు.

విశాఖ నుంచి ఖాళీ అయిన ఎమ్మెల్సీ సీటును ఇక్కడ నుంచే భర్తీ చేస్తూ మైనారిటీ సోదరులకు ఈసారి ఆ ఆనందం పంచాలని కోరుతున్నారు. మత్స్యకారులకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని ఆ సామాజిక వర్గ నేతల నుంచి కూడా కొత్త డిమాండ్ వస్తోంది. దీంతో టీడీపీ అధినాయకత్వం ఏమి చేస్తుంది అన్నది ఆసక్తిగా మారింది.

3 Replies to “మైనారిటీ కోటాలో ఎమ్మెల్సీ సీటు”

Comments are closed.