గాయని కల్పన ఆత్మహత్యాయత్నం

ప్రముఖ గాయని కల్పన ఆత్మహత్యకు యత్నించారు. ఆమె నిద్రమాత్రలు మింగి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించారు.

ప్రముఖ గాయని కల్పన ఆత్మహత్యకు యత్నించారు. ఆమె నిద్రమాత్రలు మింగి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించారు. సకాలంలో పోలీసులు స్పందించి ఆమెను వెంటనే హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ హాస్పిటల్ లో ఆమె చికిత్స పొందుతున్నారు.

భర్తతో కలిసి హైదరాబాద్ లోని నిజాంపేట్ లో ఉంటున్నారు కల్పన. కుటుంబ కలహాల వల్ల ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారా లేక వృత్తిగత కారణాల వల్ల ఈ పని చేశారా అనేది తెలియాల్సి ఉంది. కల్పన ఆత్మహత్యకు యత్నించిన విషయం పోలీసులకు తెలిసి వెంటనే ఆమె ఇంటికి వెళ్లారు. మెయిన్ డోర్ లాక్ చేసి ఉండడంతో ఎంత ప్రయత్నించినా తెరవలేకపోయారు. వెనక వైపు నుంచి వెళ్లి కిచెన్ డోర్ పగలగొట్టారు.

అది డ్యూప్లెక్స్ నివాసం. ఇంట్లో అడుగుపెట్టగానే చీకటిగా ఉంది. లైట్లన్నీ ఆర్పేసి ఉన్నాయి. లోపల నుంచి మెట్లు ఎక్కి పైన ఉన్న బెడ్ రూమ్ లోకి వెళ్లారు. అక్కడ మంచపై అచేతనంగా పడి ఉన్నారు కల్పన. వెంటనే పోలీసులు, అంబులెన్స్ లో ఆమెను దగ్గర్లోని ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్చారు.

స్ట్రాంగ్ ఉమెన్ గా కల్పనకు గుర్తింపు ఉంది. ఆమె పాటలు ఎంత ఎనర్జిటిక్ గా ఉంటాయో, ఆమె బాడీ లాంగ్వేజ్ కూడా అలానే ఉంటుంది. అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు బయటకొచ్చి మీడియా ముందు గట్టిగా మాట్లాడిన ఏకైక మహిళ ఆమె. అలాంటి గాయని ఆత్మహత్యకు యత్నించడం సంచలనంగా మారింది.

4 Replies to “గాయని కల్పన ఆత్మహత్యాయత్నం”

    1. 2 days nunchi door teyyaledhu, doubt vachi akkada vunnavallu door kotteru, evaru teyyaledhu, police ki phine cheseru, lopalaki velleru, bed medha padukunnaru, leperu, levaledhu, ambulance ki call cheseru, doctors chepperu sleeping tablets vesukunnaru ani,

Comments are closed.