ఊర్వశిలా మారిపోయిన ఓరి

అతికి పర్యాయపదం ఊర్వశి రౌతేలా. తన ఓవర్ యాక్షన్ స్టేట్ మెంట్స్ తో ఆమె నిత్యం సోషల్ మీడియాను ఎట్రాక్ట్ చేస్తుంది. ఇప్పుడు అలాంటి ఓవరాక్షనే చేస్తున్నాడు ఓరి.

మొన్ననే ఊర్వశి రౌతేలాతో కలిసి పార్టీ చేసుకున్నాడు. ఆమెతో కలిసి దుబాయ్ లో క్రికెట్ మ్యాచ్ చూశాడు. అంతే.. ఆ 2 మీటింగ్స్ కే ఊర్వశిలా మారిపోయాడు సోషల్ మీడియా సెన్సేషన్ ఓరి (ORRY). ఓరి ఇచ్చిన ఓ స్టేట్ మెంట్ చూసి జనాలంతా ఇదే ఫీల్ అవుతున్నారు.

అతికి పర్యాయపదం ఊర్వశి రౌతేలా. తన ఓవర్ యాక్షన్ స్టేట్ మెంట్స్ తో ఆమె నిత్యం సోషల్ మీడియాను ఎట్రాక్ట్ చేస్తుంది. ఇప్పుడు అలాంటి ఓవరాక్షనే చేస్తున్నాడు ఓరి. ఇతడు టచ్ చేస్తే అమ్మాయిలు గర్భం దాలుస్తారంట. దీని గురించి మాట్లాడుకునేముందు, అసలు ఓరి ఎవరో చూద్దాం..

ముంబయికి చెందిన 29 ఏళ్ల సోషల్ మీడియా సెన్సేషన్ ఈ ఓరి. ఇతడి పూర్తి పేరు ఓర్హమ్ అవత్రమణి. సింపుల్ గా తన పేరు ఓరిగా మార్చుకున్నాడు. స్టార్స్ తో ఎక్కువగా కలిసి తిరగడం, వాళ్లతో ఫొటోలు దిగడంతో ఇతడు ఫేమస్ అయిపోయాడు. దీనికితోడు అలా ఫొటోలు దిగినప్పుడు ఓ వెరైటీ పోజు ఒకటి పెడతాడు. తన చేత్తో సదరు సెలబ్రిటినీ టచ్ చేస్తూ ఫొటోలు దిగుటుంటాడు.

ఇప్పుడా టచ్ గురించే మాట్లాడాడు. తన స్నేహితుడికి పెళ్లయి 8 ఏళ్లయినా పిల్లలు లేరని, ఓసారి తను అతడ్ని టచ్ చేశానని, 3 నెలలు తిరిగేసరికి అతడి భార్య గర్భందాల్చిందని చెప్పుకొచ్చాడు. ఈ ఒక్క స్టేట్ మెంట్ తో అతడు వైరల్ అయిపోయాడు. ఊర్వశి రౌతేలా మేల్ వెర్షన్ తో జనం అతడ్ని పోల్చడం స్టార్ట్ చేశారు.

బాలీవుడ్ లో కొన్ని జంటలకు పిల్లలు లేరని, వాళ్లను కూడా వెళ్లి టచ్ చేయాలంటూ సోషల్ మీడియాలో ఇతడిపై ట్రోలింగ్ ఊపందుకుంది. ఊర్వశి రౌతేలాతో గడిపిన 2 రోజులకే ఇతడిలా ఓవరాక్షన్ స్టార్ట్ చేశాడంటూ మరికొందరు చెప్పుకొస్తున్నారు. మొత్తానికి తన బుర్రలేని స్టేట్ మెంట్ తో ఓరి మరోసారి సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయాడు.

8 Replies to “ఊర్వశిలా మారిపోయిన ఓరి”

Comments are closed.