వ‌య‌సుతో పాటు అర్థ‌మ‌య్యే జీవిత స‌త్యాలు!

గోల్ మీదే కాకుండా, దాని దిశ‌గా చేసే జ‌ర్నీ కూడా ముఖ్య‌మే. జ‌ర్నీని ఆస్వాధించ‌లేక‌పోతే గోల్ కు రీచ్ అయినా చేసిన ప్ర‌యాణం క‌ష్టంగానే గుర్తుండిపోతుంది!

జీవితంలో ఎదుర‌య్యే ప‌రిస్థితుల‌పై విప‌రీత‌మైన రియాక్ష‌న్లు ఉంటాయి చాలా మందిలో! అతిగా భావోద్వేగాల‌కు లోన‌య్యి, అతిగా ఆలోచిస్తూ జీవితాన్ని కాంప్లికేట్ చేసుకునే వాళ్లు కూడా కోకొల్ల‌లు. అయితే ప‌రిస్థితుల‌ను ఎదుర్కొనే ప‌రిణ‌తి ఉండ‌క‌పోతే చాలా క‌ష్టం. కొన్ని విష‌యాలు అనుభ‌వంలోకి వ‌చ్చాకా అస‌లు విష‌యం బోధ‌ప‌డుతుంది. వ‌య‌సుతో పాటే చాలా జీవిత స‌త్యాలు అర్థం అవుతాయి, ఈ విష‌యాన్ని చెప్ప‌డానికి జ్ఞానులే అక్క‌ర్లేదు. జీవితంలో ఎత్తుప‌ల్లాల‌ను చూసి ఒక వ‌య‌సుకు చేరిన చాలా మందిని అడిగినా త‌త్వాన్ని బోధిస్తారు! అదేం వేదాంతం కాదు, జీవితంలో త‌ప్ప‌నిస‌రిగా అర్థం చేసుకోవాల్సిన త‌త్వం!

మీ ఎంపిక‌లతోనే మీ జీవితం!

మీరు ఎంపిక చేసుకున్న జీవ‌న శైలిని బ‌ట్టే మీ జీవితం ఉంటుంది. ఒక‌టి ఎంచుకుని, మ‌రోటి ఆశించ‌డం వ‌ల్ల మిగిలేది నిరాశే! ల‌క్ ఉంటుంద‌ని, జీవితాన్ని అదే మార్చేస్తుంద‌ని ఆశించ‌డం కూడా నిరాశ‌ను క‌లిగించే అంశ‌మే! స‌రైన రీతిలో ప్రణాళిక బ‌ద్ధంగా ప‌ని చేయ‌డం ఒక్క‌టే జీవితాన్ని స‌రైన దిశ‌గా న‌డిపిస్తుంది. మిగ‌తా వాటిపై ఆశ‌లు పెట్టుకోన‌క్క‌ర్లేదు.

మార్పుకు అల‌వాటు ప‌డాల్సిందే!

జీవితం సుఖ‌మ‌యంగా సాగుతున్న‌ప్పుడూ అదే శాశ్వ‌తం అనే భావ‌న‌కు లోను కాన‌క్క‌ర్లేదు, అలాగే క‌ష్టాలు ఎదుర‌యిన‌ప్పుడు కూడా కుంగిపోనక్క‌ర్లేద‌ని చెబుతుంది అనుభ‌వం. రెండూ శాశ్వ‌తం కాదు. జీవితంలో మార్పులు ఉంటాయ‌నే విష‌యాన్ని అర్థం చేసుకోవాలి. ఎలాంటి ప‌రిస్థితులు అయినా.. అవే శాశ్వ‌తం కాద‌ని అర్థం చేసుకోవ‌డం జీవిత ప‌రామ‌ర్థాన్ని గ్ర‌హించ‌డ‌మే!

మిమ్మ‌ల్ని మీరు ప్రేమించుకోవాలి!

మీరు బ‌య‌ట‌వాళ్ల‌ను ప్రేమించే సంగ‌తి ఎలా అయినా అంత‌క‌న్నా ముందు మిమ్మ‌ల్ని మీరు ప్రేమించుకోవాలి. మీరు మిమ్మ‌ల్ని ప్రేమించుకునేలా మీ తీరు ఉండాలి. మిమ్మ‌ల్ని మీరు ప్రేమించుకోలేక‌పోతే.. వేరే ఎవ‌రో మిమ్మ‌ల్ని ప్రేమిస్తార‌ని అనుకోవ‌డంలో కూడా అర్థం లేదు. మిమ్మ‌ల్ని మీరు స‌రిగా ట్రీట్ చేసుకోవాలి. మీతో మీ రిలేష‌న్ షిప్ స్ట్రాంగ్ గా ఉంటే, బ‌య‌ట వాళ్ల‌తో కూడా అదే జ‌రుగుతుంది!

ఎదురుదెబ్బ‌లు మిమ్మ‌ల్ని స్ట్రాంగ్ గా చేస్తాయి!

జీవితంలో ఎదుర‌య్యే కొన్ని ర‌కాల హార్ట్ బ్రేక్స్, ఎదురుదెబ్బ‌ల‌ను చ‌విచూశాకా.. నాకే ఎందుకిలా కుంగిపోవ‌డం క‌న్నా , అవి త‌దుప‌రి ప‌రిణామాల‌ను ఎదుర్కొనే శ‌క్తిని, వాటిని ఎదుర్కొనే నైపుణ్యాల‌ను పెంపొందిస్తాయ‌ని గ్ర‌హించ‌గ‌ల‌గాలి.

ఇత‌రులు మీ విజ‌యాల‌నే చూస్తారు!

మీరు విజ‌యం సాధించారా, ఫ‌లితాల‌ను సాధించారా లేదా అనేదే ఇత‌రులు గ‌మ‌నిస్తారు. అందుకోసం మీరు ప‌డిన క‌ష్టం, మీరు చేసిన త్యాగాల‌ను ఎవ్వ‌రూ ఖాత‌రు చేయ‌రు.

ఇల్లు మీకు భ‌ద్ర‌మైన‌ది!

ప్ర‌పంచం చాలా క‌ఠిన‌మైన‌ది. అందులో మీకు సుఖ‌సౌక్యాల‌ను ఇచ్చేది ఇల్లు మాత్ర‌మే! అలాంటి ఇల్లును ప్రేమాప్యాయ‌త‌ల‌తో అల్లుకోవాలి. ఇంటిని ప్ర‌శాంత‌త‌ను ఇచ్చే స్థ‌లంగా మ‌లుచుకోవాలి.

సెల్ప్ పిటీ వ‌ల్ల ఉప‌యోగం లేదు!

మీరెంతో క‌ష్ట‌ప‌డుతూ ఉంటారు, ఎన్నో త్యాగాలు చేసి ఉంటారు.. అలా అని చెప్పి మీ గురించి మీరు సానుభూతితో ఉండ‌టం స‌రికాదు. మీ పై మీకు ప్రేమ ఉండాలి కానీ, సెల్ఫ్ పిటీ ఉండ‌కూడ‌దు. దీని వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌దు.

ఈ రోజు రేప‌టికి మ్యాట‌ర్ కాదు!

ఈ రోజు క‌ఠినంగా, కీల‌కంగా అనిపించేది రేప‌టికి అస‌లు మ్యాట‌ర్ కాక‌పోవ‌చ్చు. ఈ రోజు అతిగా ఆలోచింప‌జేసే విష‌యం రేపు అస‌లు గుర్తుకు రానిదిగా మారొచ్చు. కాబ‌ట్టి.. దేని గురించి అతిగా ఆలోచించ‌డం, అతిగా ఫోక‌స్ చేయ‌డం స‌రికాదు.

గోలే కాదు, జ‌ర్నీ కూడా ముఖ్య‌మే!

జీవితంలో పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకుని ప‌ని చేయ‌డంలో త‌ప్పులేదు. అయితే ఎంత‌సేపూ గోల్ మీద దృష్టే జీవితాన్ని ఆస్వాధించ‌నివ్వ‌దు. గోల్ మీదే కాకుండా, దాని దిశ‌గా చేసే జ‌ర్నీ కూడా ముఖ్య‌మే. జ‌ర్నీని ఆస్వాధించ‌లేక‌పోతే గోల్ కు రీచ్ అయినా చేసిన ప్ర‌యాణం క‌ష్టంగానే గుర్తుండిపోతుంది!

3 Replies to “వ‌య‌సుతో పాటు అర్థ‌మ‌య్యే జీవిత స‌త్యాలు!”

  1. రెండు రోజుల క్రితమే నాలుగో పెళ్ళి చేసుకున్నాడు వెంకటేషం , కొత్త భార్యను ఇంటికి తీసుకొచ్చాడు … ఓ గదిలో ఎర్ర రంగు చీర , పచ్చ రంగు చీర , నీలం రంగు చీర వేలాడదీసి ఉన్నాయ్ …

    ” ఏమిటవి ..!? ” ఆశ్చర్యంగా అడిగింది భార్య …

    ” చనిపోయిన నా భార్యలకు చిహ్నాలు “

    ” అంటే ..!? “

    ” నా మొదటి భార్యకు ఎరుపురంగంటే ఇష్టం , ఆవిడకు గుర్తుగా ఎర్ర చీర … రెండవ భార్యకు పచ్చరంగంటే ప్రాణం , అందుకే పచ్చచీర …‌ మూడవ భార్యకు నీలం రంగంటే పిచ్చి , అందుకే నీలంచీర … ” అంటూ చెప్పుకొచ్చి , ఇంతకీ నీకు ఏ రంగంటే ఇష్టం అడిగాడు వెంకటేషం …

    ” హా .. ఇప్పుడు రంగులతో పనేముంది లెండి , ఎలాగో తర్వాత వేలాడేది చొక్కానేగా ..! ” చెప్పింది భార్య …

Comments are closed.