సినిమా అంటే డబ్బులతో వ్యాపారం. అడుగు అడుగునా నోట్లు పరిచి, దాని మీద నడిచే వ్యాపారం. స్వంత డబ్బుల దగ్గర నుంచి, సినిమా ఫైనాన్సియర్లు, పొలిటికల్ మనీ, ఇండివిడ్యువల్ మనీ ఇలా రకరకాల రూపాల్లో సినిమాకు మద్దతుగా డబ్బు వస్తూ ఉండేది. ఇప్పటికీ వస్తోంది. కానీ రాను రాను ట్రెండ్ మారుతోంది. పెద్ద సంస్థలు, పెద్ద సినిమాలు, పెద్ద వ్యాపారం అన్నట్లు మారుతోంది. అయితే ఇప్పుడు మరో కొత్త ట్రెండ్ కనిపిస్తోంది.
సరైన ఫైనాన్షియల్ బ్యాకింగ్ ఉండాలి. అంతే తప్ప కేవలం సంస్థాగత ఫైనాన్సియర్లు మాత్రమే ఉంటే సరిపోదు. ఎందుకంటే ఇప్పుడు ఒక్క సినిమా తీస్తే చాలదు. తీస్తూనే ఉండాలి. ఇయర్ ఎండింగ్ బ్యాలన్స్ షీట్ చూసుకోవాలి. సినిమాల మీద డబ్బులు పెట్టి చాలా వెయిటింగ్‌లో ఉండాలి. ఇలాంటివి అన్నీ చాలా ఉన్నాయి. అందుకే సరైన బ్యాకింగ్ కావాల్సి వస్తోంది.
టాలీవుడ్ టాప్ బ్యానర్ మైత్రీ సంస్థకు ఇలాంటి ఆర్థిక సహకారం టీ సీరిస్ నుంచి అందుతోందని సమాచారం. మైత్రీ తీసే పాన్-ఇండియా సినిమాలన్నీ బాలీవుడ్‌లో మార్కెటింగ్ పనులు, ఇతర లావాదేవీలు అన్నీ టీ సీరిస్‌తోనే. అందుకే టీ సీరిస్ నుంచి పెద్ద మొత్తంలో నిధులు మైత్రీకి వస్తున్నాయని తెలుస్తోంది. దాదాపు రూ.800 కోట్ల మేరకు టీ సీరిస్ నుంచి మైత్రీకి సహకారం ఉందని బోగట్టా. ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, నాని, పవన్ ఇలా చాలా భారీ సినిమాలు మైత్రీ చేతిలో ఉన్నాయి.
టాలీవుడ్‌లో మరో పెద్ద సంస్థ హారిక హాసిని/సితార. ఈ సంస్థ కొన్నేళ్ల క్రితం మై హోమ్ గ్రూప్ సినిమా విభాగంతో కోలాబరేట్ అయింది. పెద్ద సినిమాలు, మిడ్-రేంజ్ సినిమాలు, చిన్న సినిమాలు ఇలా రకరకాలుగా కేటగరైజ్ చేసుకుంటూ చాలా ఎక్కువ సినిమాలు చేస్తోంది ఈ సంస్థ. ఈ సంస్థకు మై హోమ్ లాంటి సంస్థ బ్యాకింగ్ ఉండటం పెద్ద ప్లస్ పాయింట్. సుమారు రూ.100 కోట్ల మేరకు మై హోమ్ పెట్టుబడి సినిమా రంగంలో పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
గీతా సంస్థ, జీఎ2 లకు ఎవరో సహకారం అందించాల్సిన పని లేదు. గీతా సంస్థనే పెద్ద ఫైనాన్సియర్. ఆసియన్ సినిమాస్‌కు కూడా అదే విధంగా ఆ సంస్థనే అతి పెద్ద ఫైనాన్స్ బ్యాకింగ్ కలిగి ఉంది.
దిల్ రాజు బ్యానర్, అశ్వనీదత్ బ్యానర్, ఇంకా కాస్త చెప్పుకోదగ్గ బ్యానర్లు ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా సంస్థాగత, రెగ్యులర్ ఫైనాన్స్ బ్యాకింగ్ మీదే ఆధారపడిపోయాయి. ఇవి ఇంకా సరైన సంస్థలతో కోలాబరేట్ కావాల్సి ఉంది.
హిట్లు కొడితే తిరుగుండదు. ఒక విధంగా ఇది బానే ఉంటుంది. కానీ మరో విధంగా పులి మీద స్వారీ.
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
Avunu