బాంబ్‌ పేల్చిన కిర‌ణ్ రాయ‌ల్ బాధితురాలు

కిర‌ణ్‌కు సంబంధించిన ఆడియో, వీడియోలను సోష‌ల్ మీడియాకు విడుద‌ల చేయ‌డం వెనుక‌, జ‌న‌సేన‌లో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లే కార‌ణ‌మ‌ని ల‌క్ష్మి తేల్చి చెప్పిన‌ట్టైంది

తిరుప‌తి జ‌న‌సేన ఇన్‌చార్జ్ కిర‌ణ్ రాయ‌ల్ బాధితురాలు ల‌క్ష్మి ఇవాళ మీడియా స‌మావేశంలో పొలిటిక‌ల్ బాంబ్ పేల్చారు. ఏడాది క్రితం త‌న ద‌గ్గ‌రి నుంచి ఆడియో, వీడియోల్ని జ‌న‌సేన జిల్లా అధ్య‌క్షుడు తీసుకుని, న్యాయం చేస్తామ‌ని హామీ ఇచ్చార‌ని ఆమె సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. కిర‌ణ్ రాయ‌ల్ రాస‌లీలల్ని ప్ర‌పంచానికి తెలియ‌జేయ‌డం వెనుక‌, ఆ పార్టీలో అత‌ని వ్య‌తిరేకులున్నార‌నే విష‌యాన్ని గ‌తంలోనే రాసిన సంగ‌తి తెలిసిందే. నేడు అదే విష‌యాన్ని కిర‌ణ్ రాయ‌ల్ బాధితురాలు తేల్చి చెప్ప‌డం గ‌మ‌నార్హం.

మీడియా స‌మావేశంలో ఆమె మాట్లాడుతూ న్యాయం చేస్తామ‌ని, కిర‌ణ్ ఇవ్వాల్సిన డ‌బ్బు ఇప్పిస్తామంటూ జ‌న‌సేన జిల్లా అధ్య‌క్షుడే ఏడాది క్రితం త‌న ద‌గ్గ‌ర అన్ని వివ‌రాల‌ను తీసుకున్నాడ‌న్నారు. ఆ త‌ర్వాత అవ‌న్నీ సోష‌ల్ మీడియాలో ఎలా ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయో త‌న‌కు తెలియ‌ద‌న్నారు. త‌న‌ను రాజ‌కీయంగా ఆట‌బొమ్మ‌లా వాడుకున్నార‌ని ఆమె వాపోయారు.

ప్ర‌స్తుతం ఎస్వీయూ పోలీస్ అధికారులు త‌న స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డానికి తీవ్రంగా క‌స‌ర‌త్తు చేస్తున్నార‌ని చెప్పారు. ఇంత‌టితో స‌మ‌స్య‌కు ముగింపు ప‌ల‌కాల‌నే ఉద్దేశంతో , త‌న కుమారుల సూచ‌న‌ల మేర‌కు మీడియా ముందుకొచ్చి బాధ్య‌త‌గా వివ‌ర‌ణ ఇస్తున్న‌ట్టు ఆమె చెప్పారు. త‌న‌ను రాజ‌కీయంగా వాడుకోవ‌ద్ద‌ని ఆమె విన్న‌వించారు. త‌న వెనుకాల ఏ రాజ‌కీయ పార్టీ లేద‌న్నారు. అయితే జ‌న‌సేన‌లో వాళ్ల మ‌ధ్య ఏముందో త‌న‌కు తెలియ‌ద‌న్నారు.

త‌న నుంచి జ‌న‌సేన జిల్లా అధ్య‌క్షుడు ఆడియో, వీడియోలు తీసుకున్న వివ‌రాల్ని పోలీసుల‌కు చెప్పాన‌న్నారు. త‌న వెనుక వైసీపీ నేత‌లున్నార‌నే ప్ర‌చారంలో వాస్త‌వం లేద‌న్నారు.

తెర వెనుకాల ఏం జ‌రిగిందంటే?

ఇటీవ‌ల కాలంలో కిర‌ణ్ రాయ‌ల్ మౌనంగా వుంటున్నాడు. అత‌న్ని పార్టీ దూరంగా పెట్టిన సంగ‌తి తెలిసిందే. అయితే త‌న‌పై ఆరోప‌ణ‌లన్నీ రాజ‌కీయ ప్రేరేపిత‌మ‌ని నిరూపించి, తిరిగి జ‌న‌సేన‌లో యాక్టీవ్‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని అత‌ను ఆలోచించాడు. విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు… రెండు రోజలుగా ల‌క్ష్మి, ఆమె కుమారుల్ని కిర‌ణ్ రాయ‌ల్ కాళ్లావేళ్లా ప‌డ్డ‌ట్టు బాధితురాలి ద‌గ్గ‌రి వాళ్ల నుంచి స‌మాచారం అందింది.

త‌న‌పై జ‌న‌సేన ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా అధ్య‌క్షుడు ప‌సుపులేటి హ‌రిప్ర‌సాద్ దుష్ప్ర‌చారం చేయించార‌నే స‌మాచారాన్ని మీడియా ద్వారా ప్ర‌పంచానికి తెలియ‌జేసి, రెండు నిమిషాల్లో తిరిగి రావాల‌ని కిర‌ణ్ వేడుకున్న‌ట్టు తెలిసింది. ఇదే సంద‌ర్భంలో ల‌క్ష్మికి ఇవ్వాల్సిన డ‌బ్బు ఇస్తాన‌ని ఆమె కుమారుల‌కు హామీ ఇచ్చిన‌ట్టు తెలిసింది. ల‌క్ష్మి, కిర‌ణ్ రాయ‌ల్ మ‌ధ్య రాజీ కుద‌ర్చ‌డంలో న‌గ‌రంలోని ఓ సీఐ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్టు స‌మాచారం.

కిర‌ణ్ రాయ‌ల్ నుంచి న్యాయం జ‌రుగుతుంద‌నే న‌మ్మ‌కం క‌లిగిన త‌ర్వాతే ఆమె మీడియా ముందుకెళ్లారు. ఒప్పందంలో భాగంగా ఆడియో, వీడియోల్ని జ‌న‌సేన జిల్లా అధ్య‌క్షుడికి ఇచ్చిన‌ట్టు మీడియా స‌మావేశంలో బాధితురాలు ల‌క్ష్మి చెప్పి, ఆ పార్టీలో కొత్త స‌మ‌స్య‌ను సృష్టించారు. కిర‌ణ్‌కు సంబంధించిన ఆడియో, వీడియోలను సోష‌ల్ మీడియాకు విడుద‌ల చేయ‌డం వెనుక‌, జ‌న‌సేన‌లో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లే కార‌ణ‌మ‌ని ల‌క్ష్మి తేల్చి చెప్పిన‌ట్టైంది. ఇప్పుడు త‌న‌కు పార్టీలో గిట్ట‌ని వాళ్ల వ‌ల్లే బ‌ద్నాం అయ్యాన‌ని, తిరిగి చేర్చుకోవాల‌ని కిర‌ణ్ రాయ‌ల్ పావులు క‌ద‌ప‌నున్నాడు. ఇంత జ‌రిగాక కూడా అత‌న్ని పార్టీ ఆద‌రిస్తుందా? లేక వ‌ద్ద‌నుకుంటుందా? అనేది తేలాల్సి వుంది.

9 Replies to “బాంబ్‌ పేల్చిన కిర‌ణ్ రాయ‌ల్ బాధితురాలు”

  1. మన అన్న కరపత్రం లోకూడా ఈవిడ కి కవరేజీ తగ్గించేశారు ,,మీరు మాత్రం ఇంకా మోస్తున్నారు

  2. direct ga target cheyaleka ila honey trap lu vesukuni tirugutunna whyseepee party ki time ayipoyindi. intha la bhayapadutunnaru endi ra lafuts.

Comments are closed.