రేష‌న్‌బియ్యం ప‌ట్టివేత‌.. ఎమ్మెల్యే అనుచ‌రుడి అరెస్ట్‌!

ఆళ్ల‌గ‌డ్డ‌లో 250 కిలోల రేష‌న్ బియ్యంతో పాటు ఒక ఆటోను పోలీసులు సీజ్ చేశారు.

ఆళ్ల‌గ‌డ్డ‌లో 250 కిలోల రేష‌న్ బియ్యంతో పాటు ఒక ఆటోను పోలీసులు సీజ్ చేశారు. అలాగే బియ్యాన్ని అక్ర‌మంగా నిల్వ ఉంచిన ఎమ్మెల్యే అనుచ‌రుడు బండారు శివ‌కుమార్ యాద‌వ్‌ను అరెస్ట్ చేయ‌డం గ‌మ‌నార్హం. రేష‌న్‌బియ్యం అక్ర‌మ ర‌వాణాపై కూట‌మి ప్ర‌భుత్వం క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ముఖ్యంగా పౌర‌స‌ర‌ఫ‌రాల మంత్రిత్వ‌శాఖ‌కు జ‌న‌సేన‌కు చెందిన నాదెండ్ల మ‌నోహ‌ర్ బాధ్య‌త వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో కూట‌మి నేత‌లే రేష‌న్ బియ్యాన్ని పేద‌ల నుంచి కొనుగోలు చేసి, వాటిని స‌న్న‌బియ్యంగా త‌యారు చేసి విక్ర‌యిస్తూ భారీ మొత్తంలో ల‌బ్ధి పొందుతున్నార‌నే ఆరోప‌ణ‌లున్నాయి. ఇందుకోసం ప్ర‌జాప్ర‌తినిధులే త‌మ అనుచ‌రుల్లో న‌మ్మ‌క‌స్తుల‌కు అక్ర‌మ బియ్యం ర‌వాణా బాధ్య‌త‌ల్ని అప్ప‌గించార‌నేది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే.

తాజాగా ఆళ్ల‌గ‌డ్డ శివారులో ఒక గోడౌన్‌లో ఒక్కో బ‌స్తా 75 కిలోల చొప్పున ఉన్న 250 బ‌స్తాల్ని పోలీసులు ప‌ట్టుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇదే ర‌కంగా ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో చాగ‌ల‌మ‌ర్రి, ఉయ్యాల‌వాడ త‌దిత‌ర మండ‌లాల్లో కూడా భారీగా చౌక‌బియ్యం నిలువ ఉంచిన‌ట్టు వార్త‌లొస్తున్నాయి. అయితే వాటిని సీజ్ చేశారా? లేదా? అనేది ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. కానీ ఎమ్మెల్యే అనుచ‌రుడి అరెస్ట్ తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఎమ్మెల్యే అనుచ‌రుడ‌ని కూడా లెక్క చేయ‌కుండా అరెస్ట్ చేయ‌డంతో పాటు రేష‌న్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు అభినంద‌న‌లు అందుకుంటున్నారు. అలాగే ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌కవ‌ర్గంలో మ‌రికొన్ని చోట్ల రేష‌న్ బియ్యం నిల్వ ఉంచారంటున్న గోడౌన్ల‌పై కూడా దాడి చేసి, అక్ర‌మాల్ని అరిక‌ట్టాల్సిన బాధ్య‌త పోలీసులు, విజిలెన్స్‌, పౌర‌స‌ర‌ఫ‌రాల‌శాఖ అధికారుల‌పై వుంద‌ని ప్ర‌జ‌లు అంటున్నారు.

6 Replies to “రేష‌న్‌బియ్యం ప‌ట్టివేత‌.. ఎమ్మెల్యే అనుచ‌రుడి అరెస్ట్‌!”

  1. అదే మన అన్న హయం లో ఐతే ప్రైమ్ లొకేషన్ లో ల్యాండ్ లేపేసి అన్న కి గుడి కట్టినట్టు కట్టి వాచ్మాన్ ని చేసేసారు..ఇప్పుడు కనీసం కొంత కాకపోతే ఏ కొంత ఐన పట్టుకుంటున్నారు..ఇలాంటివి మీరు ఏ ఉద్దేశ్యం తో రాస్తున్నారో కానీ ఇంకో ల గా మన అన్న కె బూమరాంగ్ అవుతున్నాయి

Comments are closed.