కొత్త థ్రిల్లర్ కు ‘నాంది’

నాంది అనే మంచి సినిమాను అందించిన సతీష్ వర్మ నిర్మిస్తున్న రెండో చిత్రం ‘నేను స్టూడెంట్ సర్’. హీరో బెల్లంకొండ గణేష్ కూ ఇది రెండో సినిమానే. కాలేజీ బ్యాక్ డ్రాప్ లో రాసుకున్న…

నాంది అనే మంచి సినిమాను అందించిన సతీష్ వర్మ నిర్మిస్తున్న రెండో చిత్రం ‘నేను స్టూడెంట్ సర్’. హీరో బెల్లంకొండ గణేష్ కూ ఇది రెండో సినిమానే. కాలేజీ బ్యాక్ డ్రాప్ లో రాసుకున్న థ్రిల్లింగ్ స్టోరీ అని విడుదలైన ట్రయిలర్ చెబుతోంది. 

సరదా కాలేజీ స్టోరీ చూపిస్తూనే, తెలియకుండా మర్టర్ కేసులో ఇరుక్కుపోవడం అన్నది ఓ లైన్. కానీ దీనికి చాలా లేయర్లు జతచేసినట్లున్నారు దర్శకుడు ఉప్పలపాటి రాఖీ. కాలేజీ స్టూడెంట్స్ పోరాటం, పొలిటికల్ ఇంటర్ఫియరన్స్, ఇలా అన్నీ కనిపించాయి. సై సినిమాలో మాదిరిగా రెండు వర్గాలుగా వున్న స్టూడెంట్స్, ఒక్కటై పోరాడే పాయింట్ కూడా వుంది.

ట్రయిలర్ కట్ ఆసక్తికరంగా వుంది. మహతి స్వరసాగర్ నేపథ్య సంగీతం బాగుంది. రెండో సినిమాకు గణేష్ బాగా సెటిల్ అయినట్ల కనిపిస్తోంది. నాంది సినిమాతో వైవిధ్యమైన సినిమ అందించిన నిర్మాత రెండో సినిమా కూడా కాస్త సరైన సబ్జెక్ట్ నే ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. 

సముద్రఖని మరో కీలక పాత్రలో కనిపించారు. లైన్ మరీ కొత్తది కాకపోయినా, రెండు విభిన్నమైన జానర్ లను కలిపి, ట్విస్ట్ లు ముడేయడంతో ట్రయిలర్ ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా జూన్ తొలివారంలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.