Advertisement

Advertisement


Home > Politics - Telangana

అందుకే అమ్మ ఆత్మహత్య చేసుకుంది: దీక్షిత

అందుకే అమ్మ ఆత్మహత్య చేసుకుంది: దీక్షిత

దివంగత నటుడు నందమూరి తారకరామారావు చిన్నకూతురు ఉమా మహేశ్వరి ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచారు. ఈ విషయాన్ని ఆమె కూతురు దీక్షిత పోలీసులకు వెల్లడించింది. 

ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఆమె గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుందని, ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిందని తెలిపింది. దీంతో మధ్యాహ్నం రెండున్నర గంటలకు దీక్షిత పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్న పోలీసులు మూడు గంటలకు ఆమె గదిలోకి వెళ్లారు. అప్పుడు ఆమె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు.

కాగా అనారోగ్య సమస్యలతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని దీక్షిత పేర్కొంది. ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఇంట్లో నలుగురమే ఉన్నట్లు తెలిపింది. 

దీక్షిత ఫిర్యాదు మేరకు పోలీసులు సెక్షన్‌ 174  కింద అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. కాగా సీనియర్‌ ఎన్టీఆర్‌ నాలుగో కూతురే ఉమా మహేశ్వరి. ఆమెకు ఇద్దరు కూతుళ్లు విశాల, దీక్షిత్‌.

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా