
తెలంగాణలో ఎన్నికల్లో పోటీ చేయని టీడీపీ ఏ పార్టీకి మద్దతు ఇస్తోందనే విషయమై రకరకాల చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్, బీజేపీలపై టీడీపీ శ్రేణులు ఆగ్రహంగా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. టీడీపీకి కర్త, కర్మ, క్రియ అయిన కమ్మ సామాజిక వర్గం పట్టుపట్టి మరీ టీడీపీని ఎన్నికల్లో పోటీ చేయకుండా చేశారనేది బహిరంగ రహస్యమే. దీనికి ప్రధాన కారణం... ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తే, ఓట్లు చీలిపోయి అంతిమంగా బీఆర్ఎస్‌కు రాజకీయ లబ్ధి కలుగుతోందని గ్రహించడమే.
ఈ నేపథ్యంలో తెలంగాణలోని కమ్మ సంఘాలు వనభోజనాల పేరుతో సమావేశాలు నిర్వహిస్తూ.. కీలకమైన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని తీర్మానించడం చర్చనీయాంశమైంది. ఇందులో భాగంగా టీడీపీ ప్రభావం చూపే హైదరాబాద్‌లోని కొన్ని నియోజకవర్గాలు, అలాగే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థులతో కలిసి ఆ పార్టీ నాయకులు ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. అంతెందుకు, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ తెలంగాణలో పాల్గొన్న బహిరంగ సభలో టీడీపీ పసుపు జెండాలు రెపరెపలాడాయి.
దీంతో కాంగ్రెస్‌కు టీడీపీ మద్దతు ఉందనే ప్రచారం ఊపందుకుంది. మరీ ముఖ్యంగా చంద్రబాబునాయుడిని అర్ధరాత్రి వేళ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కలుసుకుని, తెలంగాణ ఎన్నికలపై మద్దతు కోరడంతో పాటు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం నిజమే అని నమ్మేలా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకాచౌదరి తాజా కామెంట్స్ ఉన్నాయి.
ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ టీడీపీ మద్దతుపై కీలక కామెంట్స్ చేశారు. చంద్రబాబు కష్టకాలంలో ఉండగా సహకరించామన్నారు. అందుకే టీడీపీ శ్రేణులు తమకు మద్దతు ఇచ్చాయని ఆమె చెప్పారు. దీంతో కాంగ్రెస్‌కు టీడీపీ మద్దతు అధికారికమే అని రేణుకా చౌదరి చెప్పినట్టైంది.
మరోవైపు ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకున్న జనసేన, తెలంగాణలో మాత్రం బీజేపీతో కలిసి ఎన్నికల బరిలో నిలిచింది. తెలంగాణలో మిత్రపక్షమైన జనసేన పోటీలో ఉన్నప్పటికీ టీడీపీ శ్రేణులు అసలు పట్టించుకోలేదు. ఎన్నికలను సీరియస్‌గా తీసుకున్నట్టైతే, టీడీపీ మద్దతును పవన్ కోరే వారు కదా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఏది ఏమైనా స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్ట్ కావడం, తెలంగాణలో కాంగ్రెస్‌కు ఎంతోకొంత ప్రయోజనం కలిగిస్తోంది.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా